కరోనా లాంటి ఉపద్రవం ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది.ఈ టైంలో ప్రపంచానికి కరోనాను ఎక్స్ పోర్ట్ చేసిన చైనా బోర్డర్ లో సరిహద్దు దేశాల భూములు మింగేయాలని చూడడం ప్రపంచ దేశాలకు ఏ మాత్రం రుచించట్లేదు.
అందుకే అన్ని దేశాలు చైనాకు చెక్ పెట్టేందుకు దాని ఆర్థిక మూలాలను దెబ్బ కొడుతున్నాయి.అయినప్పటికీ బుద్ధి మార్చుకొని చైనా బోర్డర్ లో కాలు దువ్వుతూ మీడియా ముందు మాత్రం నీతి సూత్రాలు వల్లిస్తుంది.
ఇక చైనాకు మాటలతో చెబితే ప్రయోజనం ఉండదని భావించిన అమెరికా,బ్రిటన్ దేశాలు తన మిత్ర దేశాలైన జపాన్, ఇండియా, తైవాన్ లకోసం దక్షిణ మహాసముద్రంలో తమ వార్ షిప్ లను మోహరించాయి.వాటిని తిప్పి పంపడానికి చైనా సరికొత్త ఆయుధాలను తన ఆరస్నెల్ లోకి చేరుస్తుంది.
చైనా అంబాసిడర్ గా ఇతర దేశాలకు వెళ్ళిన ప్రతినిధులు ఆయా దేశాలలో గూఢచర్యం,హవాలా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అందువల్లనే చైనానే కాదు ప్రస్తుతం చైనా అంబాసిడర్ లు వ్యవహరిస్తున్న తీరు కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా కిరిబాటీ ద్వీపంలో చైనా రాయబారిగా వెళ్ళిన వ్యక్తి అక్కడ మనుషుల మీద నడుస్తూ వెళ్ళిన ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
దీనితో ఇదేం దారుణం రా బాబు అంటూ నెటిజన్స్ అంతా చైనాను తప్పుబట్టడంతో పాటు ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
ఈ అంశంపై స్పందించిన కిరిబాటీ అధికారులు తమ దేశానికి కొత్తగా వచ్చేవారిని ఇలా స్వాగతించడం తమ సంప్రదాయమని తెలియజేశారు.