పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం( Bhimavaram )లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.భీమవరం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) పోటీ చేస్తారనే ప్రచారానికి తెర పడిందని తెలుస్తోంది.
ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయు( Pulaparthi Ramanjaneyulu )లకు జనసేన కార్యాలయం నుంచి పిలువు వెళ్లింది.ఈ క్రమంలోనే భీమవరం జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులను పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.జనసేన( Janasena ) పిలుపు మేరకు రామాంజనేయులు హైదరాబాద్ కు చేరుకున్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన పవన్ కల్యాణ్ ను కలవనున్నారు.