టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) రేపు ఉదయం సిట్ కార్యాలయానికి( SIT Office ) వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లనున్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక మరియు మద్యం కేసుల్లో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు, షూరిటీలను చంద్రబాబు సీఐడీ అధికారులకు సమర్పించనున్నారు.
అయితే ఐఆర్ఆర్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ( AP CID ) కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.వాదనలు ముగియడంతో మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.