నిత్యం తమపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ నిత్యం తిట్టి పోస్తూ వస్తున్న ఏపీ మంత్రి కొడాలి నాని విషయంలో ఎటువంటి రాజకీయ కక్ష తీర్చుకునేందుకు అవకాశం లేకుండా పోవడం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ను నిత్యం ఇబ్బంది పెడుతూ వస్తోంది.అసెంబ్లీలో ఉన్నా, బయట ఉన్నా, తమ ప్రస్తావన తీసుకు రాకపోతే నానికి రోజు గడవని పరిస్థితి ఉంది అనే బాబు బాధ.
వైసీపీలో ఎవరిపై విమర్శలు చేసినా, నాని వెంటనే స్పందించి మీడియా సమావేశాలు నిర్వహించి మరి తిట్టి పోస్తూ ఉంటారు.ఆ తిట్ల పురాణానికి భయపడే నాని పై విమర్శలు చేసేందుకు అటు చంద్రబాబు ఇటు లోకేష్ కానీ ముందుకు రాని పరిస్థితి ఉంది.
ప్రస్తుతం మంత్రి హోదాలో ఉన్న నాని మరింత దూకుడుగా నానికి చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.దీనిలో భాగంగానే రాబోయే ఎన్నికల్లో కొడాలి నాని ఓడించి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేసేందుకు నందమూరి వారసుడు ని రంగంలోకి దించాలనే అభిప్రాయంతో బాబు ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగానే నందమూరి వారసుడు, హరికృష్ణ కుమారుడైన నందమూరి కళ్యాణ్ రామ్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గుడివాడ లో పోటీకి పెట్టాలనే అభిప్రాయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది .కళ్యాణ్ రామ్ కు రాజకీయాలపై పూర్తిగా ఆసక్తి ఉ న్నా, పరిస్థితులు అనుకూలించక ఆయన తెర ముందుకు రావడం లేదు.

అయితే ఇప్పుడు ఆయనను ఒప్పించి పార్టీలో యాక్టివ్ చేసి , రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గుడివాడలో టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించి నాని కి చెక్ పెట్టాలనే ఆలోచనతోనే బాబు ఉన్నట్లు తెలుస్తోంది.ఒకవేళ కళ్యాణ్ రామ్ బాబు ప్రతిపాదన కు ఒప్పుకోకపోతే హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ని అయినా పోటీకి దింపాలి అనే అలోచన లో బాబు ఉన్నారట.ఏది ఏమైనా నానిపై పోటీకి నందమూరి ఫ్యామిలీని బాబు ఎంచుకున్నట్టు గా కనిపిస్తున్నారు.