నేటికాలం పిల్లల్లో ఆవేశం తప్పితే ఆలోచన ఉండటం లేదు.తల్లిదండ్రులు ఒక చిన్న మాట అంటే పడరు.
మా బాగు కోసమే చెప్పారని ఆలోచించరు.ముందు వెనకా ఆలోచించకుండా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటారు.
ఇలాగే ఒక ఓ బీఫార్మసీ విద్యార్థిని ప్రవర్తించి ప్రాణాలు తీసుకుంది.ఆ వివరాలు చూస్తే.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామెన గ్రామానికి చెందిన సుప్రియ(18) అనే యువతి మొయినాబాద్ మండలంలోని గ్లోబల్ కాలేజీలో బీఫార్మసీ చదువుతోంది.చదువును నిర్లక్ష్యం చేస్తూ ఎక్కువగా సెల్ ఫోన్ మాట్లాడుతుండటం గమనించిన ఈ యువతి తల్లి ఎక్కువగా ఫోన్ మాట్లాడవద్దని సుప్రియను మందలించిందట.
తల్లి చెప్పే మాటలు తన మంచికోసం అని భావించకుండా మనస్తాపం చెంది బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందట.ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ ఆలోచన రాకపోదు కావచ్చూ.
కానీ నిండు జీవితాన్ని మాత్రం అకారణంగా బలిచేసుకున్న ఈ యువతి చేసిన పని మూర్ఖత్వంగా చేసిందని అనవచ్చూ.