కెనడాలో భారత సంతతి గ్యాంగ్ స్టర్ ల కలకలం.. ప్రజలను అప్రమత్తం చేసిన పోలీసులు..

ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో రౌడీషీటర్లు గ్యాంగ్ వార్లు చేసుకుంటూ రెచ్చిపోతున్నారు.చాలా గ్యాంగ్ ల మధ్య పోరాటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది.

 Canadian Police Alert Amid Rise In Gang Activity Details, Canadian Police , Rise-TeluguStop.com

చాలా హింసాత్మక ఘటనలతో సంబంధం ఉన్న ఇద్దరు భారత సంతతి యువకులతో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని కెనడా పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.నిందితులను బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్ కు చెందిన కరణ్ వీర్ గార్చా (24), హర్ కిరాత్ జట్టి (22) గా గుర్తించారు.

ఇద్దరి భద్రతకు ముప్పు పొంచి ఉందని పోలీసులు వెల్లడించారు.అంతే కాకుండా వారికి సన్నిహితంగా ఉన్నవారికి ముప్పు పొంచి ఉందని తెలిపారు.

ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ వారి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.గ్యాంగ్లా కార్యక్రమాలలో పాలు పంచుకోవడం, డ్రగ్స్ పంపిణీ లాంటి ఘటనలతో సంబంధం ఉన్న ఆ ఇద్దరు ప్రాణాలపైకి ముప్పును తెచ్చుకున్నారు.

తమ సన్నిహితులు చుట్టుపక్కల వారిని ప్రమాదంలోకి నెట్టారని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసినా ఈ యువకులు తమ తీరు మార్చుకో లేదని పోలీసులు తెలిపారు.

గత సంవత్సరం బ్రిటిష్ కొలంబియాలో గ్యాంగ్లా కారణంగా హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి.

చాలా ఘటనలలో భారత సంతతికి చెందిన వ్యక్తుల పాత్ర ఉన్నటువంటి దర్యాప్తులో బయటపడింది.గత సంవత్సరం ఆగస్టులో పోలీసులు ఒక జాబితాను విడుదల చేశారు.వీరిలో తొమ్మిది మంది పంజాబీ మూలాలు ఉన్నవారు ఉండడం విశేషం.

వీరి కార్యకలాపాలు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నారని భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.కెనడాలో ఇండియా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురు గ్యాంగ్ లీడర్ వివరాలను ఇరు దేశాల పోలీసులు పరస్పరం మార్చుకున్నారు.

ఖలిస్తన్ అనుకూల వర్గాలతో ఈ ఏడుగురు సన్నిహితంగా ఉన్నట్లు భారత్ ఎప్పటినుంచో కెనడాను అప్రమత్తం చేస్తూనే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube