పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా హత్య యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటన తన పనేనంటూ కెనడాలో స్థిరపడిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించాడు.
తన మిత్రులు విక్కీ మిద్దుఖేరా, గుర్లాల్ బ్రార్ హత్య కేసుల్లో సిద్దూ ప్రమేయం వుండటంతో.అందుకు ప్రతీకారంగానే మూసేవాలాను హతమార్చినట్లు గోల్డీ బ్రార్ వెల్లడించాడు.
ఎవరీ గోల్డీ బ్రార్:
సిద్దూ హత్యతో గోల్డీ బ్రార్ పేరు మారు మోగిపోతోంది.అతను ఎవరు.ఏం చేసేవాడన్న దానిపై నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నాడు.ఇతని అసలు పేరు సతీందర్ సింగ్. పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ ప్రాంతానికి చెందిన వాడు.కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో బిష్ణోయ్ తరపున గోల్డీ బ్రార్ వసూళ్ల దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ క్రమంలో లారెన్స్ బిష్ణోయ్‌కి.
మరో గ్యాంగ్‌స్టర్ దవిందర్ బంభిహాకు మధ్య గ్యాంగ్ వార్ నడుస్తోంది.పంజాబ్ సహా ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో రెండు గ్యాంగ్‌లు పరస్పరం దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతున్నాయి.
గోల్డీ బ్రార్ సన్నిహితుడు మిద్దుఖేరాను బంభిహా గ్యాంగ్ గతేడాది హతమార్చింది.దీనికి ముందు బ్రార్ సమీప బంధువు గుర్లాల్ బ్రార్ కూడా హత్యకు గురయ్యాడు.ఇతను బిష్ణోయ్‌కి అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ హత్యకు ప్రతీకారంగా కాంగ్రెస్ నేత గురులాల్ పహిల్వాన్‌ను లారెన్స్ గ్యాంగ్ హత్య చేసింది.ఈ కేసులో కీలక నిందితుడిగా వున్న గోల్డీ బ్రార్ కెనడాకు పారిపోయాడు.
ఈ క్రమంలో అతను గడిచిన ఏడాది కాలంగా ఫరీద్‌కోట్ పోలీసుల రాడార్‌లోనే వున్నాడు.గురులాల్ సింగ్ పహిల్వాన్ హత్య తర్వాత గోల్డీ బ్రార్‌తో పాటు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గోల్డీ బ్రార్ తండ్రి షంషేర్ సింగ్ పోలీస్ శాఖలో ఏఎస్‌ఐగా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
మార్చి 9, 2021న కొట్కాపురాలో ఒక వసూళ్ల దందాలో కీలకపాత్ర పోషించినందుకు షంషేర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న ప్రకారం.గోల్డీ బ్రార్ ఈ వసూళ్ల దందాకు కింగ్ పిన్ అని తెలుస్తోంది.
షంషేర్ కెనడాలో వున్న తన కుమారుడు గోల్డీ బ్రార్‌కు సమాచారం అందిస్తుంటే.ఇక్కడి అతని అనుచరులు వసూళ్లకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు.ఇందుకోసం గోల్డీ బ్రార్ వాట్సాప్ కాల్, మెసేజ్‌లను ఉపయోగించేవాడు.2021లో అతను కొట్కాపురాలో ఓ కెమికల్ సైంటిస్ట్‌కు ఫోన్ చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేశాడు.మరోవైపు మార్చి 19, 2021లో స్టానిక కోర్టు గోల్డీ బ్రార్‌పై అరెస్ట్ వారెంట్ చేసింది.