ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప జోష్ లో ఉన్నారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా ఉత్తరాది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి.ఇకపోతే ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ దక్కించుకోవడంతో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలో వెల్లడించారు.
సరైన కథ, దర్శకుడు దొరికితే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని అల్లు అర్జున్ తెలియజేశారు.అయితే ఆ సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.ఏదో పని నిమిత్తం ముంబై వెళ్లిన అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీని కలిసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయన ఆఫీస్ ముందు బన్నీ కారు దిగుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా ఉన్నఫలంగా అల్లు అర్జున్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీనీ కలవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా రాబోతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఒకవేళ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కనుక ఓకే అయితే బాలీవుడ్ ఎంట్రీకి బన్నీ లైన్ క్లియర్ అయినట్టే.అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్టు2 చిత్రీకరణ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుసగా మరికొందరి దర్శకులకు ఓకే చెప్పారు.అయితే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో సినిమా కనుక ఓకే అయితే పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేస్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.