సాధారణంగా ఈతరం యువతలో చాలామంది పాకెట్ మనీగా వచ్చిన మొత్తాన్ని అవసరాల కోసం ఖర్చు చేస్తుంటారు.పాకెట్ మనీని( Pocket money ) దాచుకుని ఖర్చు చేసేవాళ్లను సైతం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
అయితే బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన ఇద్దరు యువకులు మాత్రం తమ పాకెట్ మనీతో వ్యవసాయం చేసి లక్షలు సంపాదించారు.కొంత వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుని లక్షా 60 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు.
అయితే పెట్టిన పెట్టుబడికి వాళ్లకు రెట్టింపు ఆదాయం వచ్చింది.ఏకంగా 3 లక్షల రూపాయల ఆదాయం రావడంతో ప్రస్తుతం వాళ్ల పేర్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం.30 టన్నుల పుచ్చకాయల పంటను( Watermelon harvest ) పండించి ఈ స్థాయిలో ఆదాయం సొంతం చేసుకున్న ఇద్దరు యువకుల సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం.

ఈ ఇద్దరు యువకుల పేర్లు ప్రథమేష్ పాండురంగ్ కాగా( Prathamesh Pandurang ) , ప్రీతమ్ రాజేంద్ర చవాన్( Pritam Rajendra Chavan ) కాగా వ్యవసాయంపై ఆసక్తి ఉన్న యువకులు ఇష్టంతో వ్యవసాయం చేస్తే కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు సొంతమవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.మేలు రకం పుచ్చకాయను పండించడం వల్ల ఈ స్నేహితులకు సాధారణంగా వచ్చే ఆదాయం కంటే ఎక్కువ మొత్తం ఆదాయం వస్తోందని తెలుస్తోంది.

డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్( Drip irrigation system ) ద్వారా పుచ్చకాయల పంటను ఈ ఇద్దరు స్నేహితులు సాగు చేసి ప్రశంసలు అందుకున్నారు.సొంతంగా పనులు చేసి వ్యవసాయం చేయడం ద్వారా ఈ ఇద్దరు స్నేహితులకు ఖర్చులు తగ్గాయి.సరైన జాబ్ రానివాళ్లు వ్యవసాయం దిశగా అడుగులు వేస్తే దీర్ఘకాలంలో మంచి లాభాలు సొంతమవుతాయి.
పుచ్చకాయల పంట సాగు చేసిన ఈ ఇద్దరు స్నేహితులను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.ఈ స్నేహితుల సక్సెస్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పవచ్చు.