స్టీల్ ప్లాంట్ ఇష్యూతో ఏపీలో బీఆర్‌ఎస్, కేసీఆర్‌ కి అదనపు మైలేజ్‌

కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలనుకున్న వైజాగ్‌ స్టీల్ ఫ్యాక్టరీ ( Vizag Steel Factory )ని తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌ చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.సింగరేణి యాజమాన్యం( Singareni)తో వైజాగ్ స్టీల్ ను కొనుగోలు చేయించేందుకు గాను బిడ్ వేయించడం ద్వారా కేసీఆర్‌ ( KCR )అక్కడ హీరో అయ్యారు అనడంలో సందేహం లేదు.

 Brs And Kcr Getting Good Response For Vaizag Steel Issue , Ap News,brs,kcr, Vai-TeluguStop.com

వైజాగ్ స్టీల్‌ కంపెనీని దక్కించుకోవడం అనేది తెలంగాణ రాష్ట్రంకు సాధ్యం అయ్యే పని కాదు.కానీ కచ్చితంగా అక్కడి ప్రజల్లో సానుభూతి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ఇప్పటికే ఏపీకి చెందిన వారు చాలా మంది బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ అంటే అభిమానంతో ఉన్నారు.వైజాగ్‌ స్టీల్ ఇష్యూతో వారికి మరింతగా కేసీఆర్‌ పై నమ్మకం కలుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీ తో ఏపీలో మినిమం సీట్లను దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్‌ వైజాగ్‌ స్టీల్‌ ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం ద్వారా ఓట్ల శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి స్టీల్‌ ప్లాంట్‌ ఇష్యూ కారణంగా ఏపీ లో బీఆర్‌ఎస్( BRS ) కి మైలేజ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.వైకాపా తో వ్యతిరేకంగా పోరాటం చేయడం ద్వారా తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ లు అక్కడ బలంగా ముందుకు సాగుతున్నాయి.ఈ సమయంలో బీఆర్‌ఎస్ పార్టీని నిలిపి సీట్లు సాధించాలి అంటే మాత్రం కచ్చితంగా చాలా పెద్ద విషయం.

కనుక అది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుంది అనేది చూడాలంటే మరి కొన్ని నెలలు వెయిట్‌ చేయాల్సిందే.వచ్చే ఏడాది ఏపీ లో అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube