ఎవడు ఏం అనుకుంటే నాకేం నేను ఇలాగే ఉంటా: బోయపాటి

టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తన సినిమాలన్నిటీలోనూ ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలని ప్లాన్ చేస్తుంటాడు.

 Boyapati Srinivas About His Movies And Style Of Making Details, Boyapati, Direct-TeluguStop.com

చిత్ర నిర్మాణంలో ప్రొడ్యూసర్ పాత్ర ఉన్నప్పటికీ డైరెక్టర్‌నే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు.ఆయనే సినిమాను ముందుకు తీసుకెళ్తుంటారు.

తెలుగు చిత్ర సీమలో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు.అందరు డైరెక్టర్స్ ఈ విషయంలో ఒకలా వ్యవహరిస్తే బోయపాటి శ్రీను మాత్రం మరోలా వ్యవహరిస్తుంటారు.సినిమా పోస్టర్స్‌లో డైరెక్టర్స్ దాదాపుగా ఎవరూ కూడా తమ ముఖం చూపించబోరు.కానీ, బోయపాటి శ్రీను మాత్రం తన ముఖం ఉన్న ఫొటోను చూపించేస్తాడు.

ఇక సినిమా ప్రమోషన్స్‌లో అయితే బోయపాటి శ్రీను మాటలు వీర లెవల్‌లో ఉంటాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.ఇకపోతే మూవీ స్టార్ట్ అయ్యే టైంలో తనను తాను చూపించుకుని యాక్షన్ చెప్పే షాట్‌ను చూపించుకుంటాడు డైరెక్టర్ బోయపాటి.

ఈ విషయమై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ సినిమా ప్రారంభంలో బోయపాటి తన షాట్‌ను వేసుకుంటూనే ఉన్నాడు.

ఇకపోతే సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని బోయపాటి యాక్ట్ చేసి చూపించిన తర్వాతనే నటీనటులు చేస్తుంటారు.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Boyapatisrinu, Boyapati Srinu, Fights, Le

తాజాగా నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ‘అఖండ’ ఫిల్మ్‌లోని ‘అఖండ’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.ఇందులో బోయపాటి యాక్షన్ చేసి చూపించిన విధానం చూసి నెటిజన్లు బోయపాటిని ట్రోల్ చేస్తున్నారు.ఎన్నినెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ బోయపాటి నేనింతే.అనే స్టైల్‌లో తనకు నచ్చినట్లుగా సినిమాలు చేస్తూనే ఉంటారు.

Telugu Akhanda, Balakrishna, Boyapati, Boyapatisrinu, Boyapati Srinu, Fights, Le

ఇకపోతే నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గతంలో వచ్చిన రెండు ఫిల్మ్స్ ‘సింహ, లెజెండ్’ సూపర్ హిట్స్ కాగా, వీరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.ఈ సినిమాలో నందమూరి బాలయ్యతో యాక్షన్ సీన్స్ చాలా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్‌గా నటించగా, ప్రగ్యాజైశ్వాల్ బాలయ్యకు జోడీగా నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube