బీఆర్ఎస్ ఎంపీ టికెట్లను అమ్మకానికి పెట్టిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు( Raghunandan Rao ) ఆరోపించారు.మెదక్ ఎంపీ సీటును గతంలో కలెక్టర్ గా ఉన్న వ్యక్తికి బేరం పెట్టారని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్( BRS ) ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని రఘునందన్ రావు విమర్శించారు.లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha elections ) అయినా ఉద్యమకారులకు సీట్లు ఇవ్వాలన్నారు.బీఆర్ఎస్ తో పొత్తు, పొంతన కుదరదని మోదీ అప్పుడే చెప్పారన్న విషయాన్ని గుర్తు చేశారు.ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ( BJP ) ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.