బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం ఊహించని విధంగా ఎలిమినేషన్.. ఎవరంటే?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో రసవత్తరంగా సాగుతోంది.ఇప్పటికే బిగ్ బాస్ లో 8 వారాలు పూర్తి కాగా తొమ్మిదవ వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గర పడింది.

 Bigg Boss Non Stop Ninth Week Nominations And Elimination Analysis Details, Big-TeluguStop.com

ఇక 9వ వారం నామినేషన్స్ లో భాగంగా యాంకర్ శివ, అనీల్ రాథోడ్, నటరాజ్ మాస్టర్, హమీదా, బాబా భాస్కర్, అరియానా, మిత్రా శర్మ ఈ ఏడుగురు నామినేట్ అయ్యారు.అయితే 9 వ వారం ఎలిమినేషన్ లో భాగంగా ఈ ఏడుగురు కంటెస్టెంట్ లలో నుంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం 9వ వారం బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని తెలుస్తోంది.డబల్ ఎలిమినేషన్ ఉండబోతోంది అని తెలియడంతో ఆ ఇద్దరు కాంటెస్టెంట్స్ ఎవరు అన్న విషయం పై ఆసక్తికరంగా మారింది.

అదేవిధంగా ఈవారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అన్న దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే నిజానికి ఈ వారం నటరాజ్ మాస్టర్ తప్పకుండా ఎలిమినేట్ అవుతారు అని అందరు భావించారు.

కానీ ఊహించని విధంగా మంగళవారం నుంచి హౌస్ సీన్ మొత్తం మారిపోయింది.ఇక ఈ వారం మొత్తం బాస్ నాన్ స్టాప్‌లో నటరాజ్ మాస్టర్ వీక్ నడుస్తుందని చెప్పవచ్చు.

నామినేషన్స్ లో ఉన్న నటరాజ్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ కాక తప్పదు అని అందరు భావించారు.కానీ బిగ్ బాస్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను తిప్పి కొట్టాడు.

Telugu Akhil, Ariyana, Ashu, Bigg Boss, Biggboss, Double, Mithra Sharma, Nagarju

బిగ్ బాస్ లో పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో అంచనా వేయడం చాలా కష్టం.ఒక్క ఎపిసోడ్.చాలు గేమ్ తలకిందులు కావడానికి.టాప్‌లో ఉండాల్సిన వాళ్లు పాతాళానికి పడిపోతారు.పాతాళంలో ఉన్న వాళ్లు టాప్‌కి చేరుకుంటారు.బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో మిత్రా శర్మ, నటరాజ్ మాస్టర్‌ల పరిస్థితి సేమ్ టు సేమ్ ఇంతే.

ఈవారం కాకపోతే వచ్చేవారం అయినా వీళ్లు ఎలిమినేట్ అవుతారు.టాప్ 5కి వెళ్లే ఛాన్స్ అయితే లేదనుకున్నారంతా.

కానీ ఈవారంలో గేమ్ మొత్తం మారిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube