రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను గద్దె దింపేందుకు వ్యూహాత్మక ఆలోచనలు తెరమీదికి వస్తున్నాయా? అంటే.ఔననే అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం జగన్ పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉన్నప్పటికీ.ప్రతిపక్ష పార్టీల అభిప్రాయం సహజంగానే వేరు గా ఉంది.
జగన్ ఇలా ప్రమాణ స్వీకారం చేసి.అలా కుర్చీలో కూర్చున్నాడో లేదో.
వెంటనే జగన్‌పై విమ ర్శల పర్వం ప్రారంభమైంది.ముఖ్యంగా టీడీపీ కంటే.
జనసేన పార్టీ నుంచి భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి.గత ఎన్నికల్లో జనసేన పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.
అయినా.జగన్‌పై విమర్శల విషయంలో మాత్రం ఆ పార్టీ చాలా ముందుందనే అభిప్రాయం వ్యక్తమైంది.ఇక, ఈ క్రమంలోనే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది.ఆ తర్వాత బీజేపీ వ్యూహం ఎలా ఉన్నా.తర్వా త తర్వాత.మాత్రం జగన్‌పై విమర్శల పర్వాన్ని పెంచింది.ఇక, టీడీపీ సర్వసాధారణంగా.జగన్‌పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్న విషయం తెలిసిందే.
ఇక, ఇప్పుడు ఎన్నికలకు మూడు సంవత్సరాల ముందు నుంచే భారీ వ్యూహం ఏదో ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకుంటోందనే సంకేతాలు వస్తున్నాయి.అంటే.
జగన్‌ను ఓడించేందుకు భారీ ఎత్తున పధక రచన సాగుతున్నట్టు సమాచారం.

మరోవైపు.జనసేనను బలపరిచేందుకు మెగా హీరో చిరంజీవి .రంగంలోకి దిగుతున్నారనే విషయం తెరమీదికి వచ్చింది.ఇక, ఇప్పటికే.బీజేపీతో జనసేన పొత్తుపెట్టుకుని ఉండడం, మరోవైపు.చిరు జన సేనను బలపరిచేందుకు రంగంలోకి దిగుతుండడం.ఈ పరిణామాలను గమనిస్తే.2009లో వైఎస్ రాజ శేఖరరెడ్డి హవా0ను నిలువరించేందుకు.పెద్ద ఎత్తున వ్యూహాలపై వ్యూహాలు పన్నుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇక.ఈ రెండు పార్టీలతోనూ కలిసి ముందుకుసాగేందుకు ఇప్పటికే టీడీపీ రెడీగా ఉంది.మిగిలిన పార్టీల్లో కమ్యూనిస్టులు .కూడా అప్పటి పరిణామాలను బట్టి.ఈ కూటమిలో చేతులు కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.ఏదేమైనా.మరోసారి తెరమీదికి 2009నాటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.మరిఈ దూకుడును జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.