బండి సంజయ్ నిరుద్యోగ దీక్షను తప్పుపట్టిన తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం..

తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశంలో మాట్లాడుతూ.దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

 Telangana Jac Chairman Gajjela Kantham Opposes Bandi Sanjay Nirudyoga Deeksha De-TeluguStop.com

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, కేంద్రం తరపున ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో .బీజేపీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు తరుణ్ చుగ్ సమాధానం చెప్పాలన్నారు.బీజేపీ పాలిస్తున్న మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

2014 ఎన్నికల సమయంలో మేనిఫెస్టో లో చెప్పినట్టు ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ప్రధాని నరేంద్ర మోడీ ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని మండి పడ్డారు.దీనికి ముందు బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు.బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టడం సిగ్గు చేటని, దానికి అర్థం ఏమిటో చెప్పాలని మండి పడ్డారు.2014 నుంచి రిజర్వేషన్ లను సరిగ్గా అమలు చేస్తున్నారా అనేది బండి సంజయ్ సమాధానం చెప్పాలని, ఎస్సీ ,ఎస్టీ, బీసీ మైనార్టీలను చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రతి ఏటా జరిగే 12 లక్షల ఉద్యోగ నియామకాలు ఎందుకు జరగడం లేదు? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే కుట్ర చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు.

ఎల్ ఐ సి, ఎయిర్ వే, రైల్వే వ్యవస్థలను ప్రైవేట్ పరం చేసి, లక్షల కోట్ల మందిని రోడ్డున పడేసిన పాపం బీజేపీదే అంటూ అర్ ఎస్ ఎస్, బీజేపీ లపై మండి పడ్డారు.ఎస్సీ ,ఎస్టీ, బీసీ లను అణిచి వేసేలా చెయ్యమని రాముడు చెప్పాడా అని ఫైర్ అయ్యారు.మాజీ ప్రధాని విపి సింగ్ అనుకున్నట్టు బీసీ లకు 52 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, ప్రతిపాదించగా ఆ విపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చింది బీజేపీ అంటూ విమర్శించారు.

బీసీ లెక్కలను ప్రభుత్వం ఎందుకు చెయ్యడం లేదు అని ప్రశ్నించారు.

బీసీలకు రిజర్వేషన్ లు ఇవ్వాలని ఢిల్లీలో దీక్ష చెయ్యాలని సవాల్ విసిరారు.బండి ఎన్ని కుయుక్తులు పన్నినా, దీక్షలు చేపట్టిన తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు.

ప్రధానికి, రాష్ట్ర అధ్యక్షులకు, కేంద్ర మంత్రులకు మధ్య పొంతన లేదని అన్నారు.దళిత, గిరిజన, బీసీ ల కోసం తాము పక్కాగా కొట్లాడతం అని ప్రధాని మోడీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనవరి 8 న ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయబోతున్నాం అని ప్రకటించారు.

దేశ యువత మీద, రైతుల మీద బీజేపీ ఉక్కు పాదం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Gajjala Kantham Fires on BJP Leader Bandi Sanjay

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube