టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) వ్యవహార శైలిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా లోకేష్ ఇటీవల కాలంలో మాట్లాడుతున్న మాటలు తెలుగు తమ్ముళ్లకు తెగ నచ్చేస్తున్నాయి.
దీనికి కారణం అన్ని విషయాలలోనూ క్లారిటీగా మాట్లాడుతుండడం, ఏ విషయాల్లోనూ మొహమాటలకు వెళ్లకుండా ముక్కుసూటిగా మాట్లాడుతుండడం, గతంలో లోకేష్ ఏం మాట్లాడినా అందులో తప్పులు దొర్లేవి.అయితే ఇటీవల కాలంలో లోకేష్ అధికార పార్టీ వైసీపీ( ycp ) పై విరుచుకుపడుతున్నారు.
పంచ్ డైలాగులు వేస్తున్నారు.ప్రజలతోనూ మమేకమవుతూ, వారికి కుశల ప్రశ్నలు వేస్తూ ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నారు.
కానీ చంద్రబాబు వ్యవహార శైలి దీనికి భిన్నం.అన్ని విషయాల్లోనూ మొహమాటం అన్నట్లుగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది.
ఎవరిని ఏమీ అనలేరు.కర్ర విరగదు పాము చావదు అనే విధంగా చంద్రబాబు వ్యవహారం ఉంటుంది.
ఏ విషయంలోనూ తాడో పేడో తేల్చరు.నాన్చివేత ధోరణి అవలంబిస్తూ ఉంటారు.
కానీ లోకేష్ మాత్రం దానికి భిన్నంగానే వ్యవహరిస్తున్నారు.
ఏదైనా ఒక విషయం లోకేష్ వద్దకు వెళ్తే నాంచివేత లేకుండా తేల్చేస్తారని పార్టీలో టాక్.ఇక పార్టీలో విధేయులుగా ఉన్న సీనియర్ నాయకుల విషయంలో లోకేష్ ప్రత్యేక అభిమానం చూపిస్తూ ఉంటారట.ఇటీవల కాలంలో లోకేష్ చాలా కీలక నిర్ణయాలను ప్రకటిస్తున్నారు .మీడియా ఇంటర్వ్యూలలోను అన్ని విషయాలపై తడుముకోకుండా క్లారిటీ ఇస్తున్నారు.ముఖ్యంగా జనసేన, టిడిపి( Janasena, TDP ) పొత్తుపై జనాల్లోనూ, రెండు పార్టీల నేతలలోను అనేక సందేహాలు ఉన్నాయి.
టిడిపి ,జనసేన కలిసి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు అనేది రెండు పార్టీలు నేతలకు సరైన క్లారిటీ లేదు.
ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సైతం సూటిగా మాట్లాడలేకపోయారు.అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కూర్చి విషయమై చంద్రబాబుతో చర్చిస్తానని మాత్రమే అన్నారు.కానీ లోకేష్ సీఎం పదవి విషయంలో క్లారిటీగా చెప్పేశారు .సీఎం పదవిని జనసేనతో షేర్ చేసుకోవడం లేదని, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా క్లియర్ గా ఉన్నారని, అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కూడా అభిప్రాయపడుతున్నారని లోకేష్ క్లారిటీగా చెప్పేశారు.అసలు ఈ స్థాయిలో క్లారిటీ ఇవ్వడానికి కారణం.
సిఎం అభ్యర్థి ఎవరనే విషయంలో అయోమయం తమ పార్టీ నాయకులకు ఉండకూడదని లోకేష్ ఆలోచించే, జనసేన విషయంలో ఎటువంటి మొహమాటానికి వెళ్లకుండా క్లారిటీగా చెప్పినట్లుగా అర్థమవుతుంది.లోకేష్ ఈ డైలాగులు తర్వాత జనసేన పెద్దగా రియాక్ట్ కాలేదు.
కానీ జనాలకు రెండు పార్టీల నాయకులకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.