దేశవ్యాప్తంగా పేరుపొందిన ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishore ) ఇప్పుడు ఏపీలో పెద్ద కలకాలానికే తెరతీశారు.2019 ఎన్నికల్లో వైసీపీ రాజకీయ వ్యవహర్తగా ప్రశాంత్ కిషోర్ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారు.వైసీపీ 121 సీట్లతో అధికారంలోకి వచ్చేలా చేయగలిగారు.జగన్ ( jagan )చరిష్మాతో పాటు, పీకే వ్యూహాలు బాగా పనిచేసే ఆ స్థాయిలో వైసీపీకి విజయం అయితే ప్రశాంత్ కిషోర్ తీసుకువచ్చారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల తరువాత రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణానికి పుల్ స్టాప్ పెట్టేసి కొత్త రాజకీయ పార్టీని పెట్టి, బీహార్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు.కానీ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ ఏపీ అధికార పార్టీ వైసీపీకి( ycp ) రాజకీయ వ్యూహాలు అందిస్తోంది.
అయితే గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నారని , దీనికి సంబంధించిన డీల్ కూడా సెట్ అయ్యిందనే ప్రచారం తీవ్రంగా జరగగా, దీనిని వైసిపి ఖండించింది.
టిడిపి కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయడం వట్టి పుకారు మాత్రమే అంటూ ఆ పార్టీ ఖండించింది.అయితే నిన్న ప్రశాంత్ కిషోర్ ఏపీలో అడుగుపెట్టడం, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) తో కలిసి ప్రత్యేక విమానంలో ఆయన విజయవాడకు రావడం, నేరుగా ఒకే కారులో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం వంటివన్నీ రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) అరెస్ట్ అయిన సమయంలో, ఢిల్లీ వెళ్లిన లోకేష్ ప్రశాంత్ కిషోర్ తో ప్రత్యేకంగా భేటీ అయి, తమ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేయాలని కోరగా, అప్పట్లో పీకే నిరాకరించారని, కనీసం రాజకీయ సలహాదారుగా ఉండాలని లోకేష్ కోరారట.
ఆ విజ్ఞప్తి మేరకే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు తో భేటీ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ పరిణామాలన్నీ అధికార పార్టీ వైసిపికి ఆందోళన కలిగిస్తున్నాయి.మొన్నటి వరకు తమతో పని చేసిన ప్రశాంత్ కిషోర్ కు తమ రాజకీయ వ్యవహారాలు, తమ పార్టీ పరిస్థితి బాగా తెలుసు అని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టిడిపి కోసం పనిచేస్తే తమకు జరిగిన నష్టం తీవ్రంగా ఉంటుందని వైసిపి ఆందోళన చెందుతుంది.ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీం సర్వే రిపోర్ట్ ల ఆధారంగానే జగన్ నియోజకవర్గ ఇన్చార్జీల మార్పుకు శ్రీకారం చుట్టారు.
సరిగ్గా ఇదే సమయంలోనే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడంతో, వీరి మధ్య కుదిరిన డీల్ పై వైసీపీ ఆరా తీస్తోంది.