దక్షిణ భారత చలన చిత్ర నటి షకీలా.తాను ఎక్కువగా శృంగార చిత్రాలలో నటించింది.
చూడటానికి షకీలా అలా ఉంటుంది కానీ నిజ జీవితంలో ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కొంది.ఆమెను ఓ నటిగా ఎవరు గుర్తించలేకపోయారు.
కేవలం తను నటించే పాత్రల గురించి నటించాల్సి వచ్చింది.సినీ పరిశ్రమకు చెందిన నటీనటులకు జీవిత సమస్యలు ఉండవని అనుకుంటే తప్పు పడినట్లే.
వాళ్ల జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి.కానీ తెర ముందుకు వస్తే అవన్నీ మర్చిపోయి ప్రేక్షకుల కోసం నటిస్తుంటారు.
ఇలా షకీలా కూడా తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని చివరికి ఏ తోడు సహాయం లేకుండా ఒంటరిగా మిగిలింది.ఈమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం కన్నడ వంటి సినిమాల్లో నటించింది.
ఈ చిత్రపరిశ్రమను ఆమెను నటిగా కాకుండా కొన్ని పాత్రల కోసం సినిమాలలో నటించింది.ఆమె ఎంత సంపాదించినా తనకు ఇవ్వకుండా తన సంపాదన మొత్తం అక్క, అమ్మ చేతుల్లోనే ఉంటుందని ఎన్నో ఇంటర్వ్యూలలో తెలిపింది.
ఇదిలా ఉంటే తనకు డైరెక్టర్ తేజ ఫోన్ చేసి మాట్లాడిన పద్ధతిలో ఎంతో భావోద్వేగానికి గురైంది.

ఇటీవలే షకీలా అలీ సమక్షంలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా షో లో పాల్గొంది.ఈ షోలో ఆమె తన వ్యక్తిగత విషయాలను, తను జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి తెలపగా దర్శకుడు తేజ గురించి కొన్ని విషయాలు తెలిపింది.కరోనా సమయంలో దర్శకుడు తేజ తనకు ఫోన్ చేసి ఏమ్మా బాగానే ఉన్నావా డబ్బులకు ఏమైనా ఇబ్బంది పడితే చెప్పు పంపుతాను అని మాట్లాడగా వెంటనే ఏడ్చిందట.
తనను ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదంటూ చివరికి తన తమ్ముడు సలీం కూడా ఏ రోజు ఫోన్ చేసి పలకరించలేదు అంటూ పెద్ద డైరెక్టర్ తేజ గారు నాకు ఫోన్ చేసి నా గురించి అడిగినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురైయానని తెలిపింది.