తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండానే పూర్తిస్థాయి ఎన్నికల వాతావరణం ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తుంది.పేరుకు మూడు పార్టీల మధ్య పోటీలా కనిపిస్తున్నప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్( Congress ) మరియు బారతీయ రాష్ట్ర సమితి( BRS ) మధ్యనే పోటీ ఉండబోతున్నట్లుగా ఇప్పటికే స్పష్టమైంది.
నిన్న మొన్నటి వరకు బారాసాతో పోల్చితే కొంత బలహీనంగా కనబడిన కాంగ్రెస్ ఇటీవల కీలక నాయకులను పార్టీలోకి చేర్చుకోవడంలో విజయం సాధించడంతో పాటు ఎవరి దారి వారిదన్నట్లుగా ఉండే సీనియర్ నాయకులను కలుపుకొని పోవడంలో టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) విజయం సాధించినట్లే కనపడుతుంది.
దాంతో ఇప్పుడు కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తుంది.
కలిసివచ్చే ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కాంగ్రెస్ ఒక వైపు ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూనే మరో వైపు గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చేందుకు ప్రత్యేక కృషి చేస్తుంది.దీంతో ఇప్పుడు వాతావరణం చూస్తుంటే బారాసాకి గట్టి పోటీ ఇచ్చే విధంగా కాంగ్రెస్ తయారయ్యింది అని చెప్పవచ్చు.
అంతేకాకుండా ఈనెల 15 16 17 వ తారీకులలో సిడబ్ల్యూసి కమిటీ సమావేశాలు( CWC Meeting ) జరగబోతుండడం తో దీనిని తెలంగాణ ఎన్నికలకు ఒక కర్టెన్ రైజర్ గా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తుంది.
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ చార్జి షీట్ ( Charge Sheet ) కాంగ్రెస్ విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది.అధికార బారాస గతంలో ఇచ్చిన హామీలను, వాటి అమలు పరిస్థితిని కంపేర్ చేస్తూ అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు వచ్చేలా చేయాలని టి .కాంగ్రెస్ భావిస్తుంది.అంతేకాకుండా కర్ణాటకలో విజయవంతమైన హామీల పాలసీని తెలంగాణకు కూడా అప్లై చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రజలను ఆకట్టుకునే అద్భుతమైన హామీలు కోసం నిపుణులతో సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తుంది.
ఏదో హామీ ఇచ్చాం వస్తే చూస్తాం అన్నట్టుగా కాకుండా “చెప్పామంటే-చేస్తామంతే “ అన్నట్టుగా ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రజలను నమ్మించే విధంగా ముందుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తుంది.కాంగ్రెస్ కమిటీ సమావేశాల చివర రోజైన 17వ తారీఖున భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్న టీ కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను కూడా ఆరోజు రిలీజ్ చేయబోతుందని తమ అద్భుతమైన పథకాలతో తెలంగాణ ప్రజల మనలను పొందబోతామన్నట్టుగా ఆ పార్టీ కీలక నేత బట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) వ్యాఖ్యానించారు.దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్కు అన్ని శుభశకునాలే కనిపిస్తున్నట్లుగా ఉంది.