ఏపీ అసెంబ్లీ సమావేశాలు( AP Assembly Sessions ) ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ క్రమంలో సమావేశాలకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) నోటిఫికేషన్ జారీ చేశారు.5వ తేదీ ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్( Vote On Account Budget ) పేరుతో జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు దాదాపు మూడు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది.కాగా తొలిరోజు గవర్నర్ ప్రసంగం అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Minister Buggana Rajendranath Reddy ) సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది.