టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టికి ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే.లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మొదలుకొని స్టార్ హీరోల పక్కన సినిమాల్లో హీరోయిన్‌గా మొదటి ఛాన్స్ ఆమెకే ఇవ్వాలని చూస్తుంటారు చిత్ర దర్శకనిర్మాతలు.
అయితే ఓ సినిమా కోసం అనుష్క చేసిన రిస్క్ ఇప్పుడు ఆమెపాలిట శాపంగా మారింది.ఆ రిస్క్ కారణంగా అధిక బరువు పెరిగిపోయిన అనుష్క, ఇప్పుడు ఆ బరువును తగ్గించుకునేందుకు చాలా కష్టపడుతోంది.
గతంలో బాహుబలి చిత్రం తరువాత సైజ్ జీరో చిత్రంలో నటించిన అనుష్క, ఆ సినిమా కోసం చాలా బొద్దుగా మారింది.ఇక ఆ తరువాత బాహుబలి 2 చిత్రం కోసం అనుష్క సన్నబడేందుకు చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
దీంతో అనుష్క పాత్రను వీఎఫ్ఎక్స్ సాయంతో తెరకెక్కించాడు దర్శకుడు రాజమౌళి.అయితే ఇప్పుడు తాజాగా ఓ సినిమాను ఓకే చేసిన అనుష్క, ఈ సినిమాలో ఎలాగైనా సన్నబడాలని చూస్తుంది.
దీని కోసం ఆమె చాలా వర్కవుట్లు చేస్తుందని, డైట్‌ను ఖచ్చితంగా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా ఓ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క, ఇప్పుడు ఆ బరువును తగ్గించేందుకు విపరీతంగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సినిమా కోసం అనుష్క ఎంతమేర సన్నబడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
అయితే ఈ సినిమాలో అనుష్క పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మొత్తానికి అనుష్క నుండి మరొక వైవిధ్యమైన సినిమా రానుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.