ఆది పురుష్ లో సీతగా మహానటి ఫైనల్.. త్వరలో కన్ఫర్మ్

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకొని దూసుకుపోతున్న అందాల భామ కీర్తి సురేష్.ఈ అమ్మడు నటించిన రంగ్ దే సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

 Keerthy Suresh Confirmed As A Sita In Adipurush Movie, Tollywood, Bollywood, Sou-TeluguStop.com

మరో విపు మహేష్ బాబుతో చేస్తున్న సర్కారి వారి పాట షూటింగ్ జరుగుతుంది.అలాగే ఆమె లీడ్ రోల్ లో చేసిన గుడ్ లక్ సఖి కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక కోలీవుడ్ లో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.ఇలా చేతినిండా సినిమాలతో అమ్మడు అస్సలు ఖాళీ లేకుండా ఉంది.

మొత్తం తెలుగు, తమిళ్, మలయాళీ బాషలని కవర్ చేస్తూ సినిమాలు చేస్తుంది.మాతృభాషలో తన తండ్రి నిర్మాణంలో ఒక సినిమాకి సైన్ చేసింది.

మహానటి సినిమా కీర్తి సురేష్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది.ఆ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డుని సైతం అందుకొని బాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించింది.

అక్కడ ఎంట్రీ ఇద్దామని ప్రయత్నం చేసిన ఎందుకనో అది వర్క్ అవుట్ కాలేదు.బాలీవుడ్ ఎంట్రీ కోసం కొంతకాలం బోనీ కపూర్ ఫ్యామిలీతో కలిసి ముంబైలో కీర్తి సురేష్ తిరిగింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు బాలీవుడ్ లో డార్లింగ్ ప్రభాష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ సినిమాలో సీత పాత్ర కోసం కీర్తి సురేష్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమా ఎనౌన్స్ చేసిన సమయంలో కీర్తి సురేష్ పేరు బయటకి వచ్చింది.

అయితే దానిపై హీరోయిన్, ఆది పురుష్ దర్శకుడు కూడా క్లారిటీ ఇచ్చారు.ఇక సీత పాత్ర కోసం కృతి సనన్ ని కన్ఫర్మ్ చేశారని ప్రచారం జరిగింది.

అయితే వారికి లుక్ టెస్ట్ చేసిన తర్వాత కీర్తి సురేష్ అయితేనే సీత పాత్రకి కరెక్ట్ గా సరిపోతుందని దర్శకుడు ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో ఆమెని కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం.

ఇక రావణుడి భార్య మండోదరి పాత్ర కోసం కృతి సనన్ ని ఫైనల్ చేసారని బిటౌన్ లో వినిపిస్తున్న టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube