ఏపీలో గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు( Anganwadis ) రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు ఈ నెల 26 నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించనుందని తెలుస్తోంది.
ఎస్మా చట్టం( ESMA Act ) ప్రకారం ఇప్పటికే నోటీసులు ఇచ్చినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలను తొలగించాలంటూ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు( District Collectors ) ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే ఈనెల 25న నోటిఫికేషన్ ఇచ్చి 26వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా అంగన్వాడీల పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నారని తెలుస్తోంది.జూన్ లో జీతాల పెంపునకు హామీ ఇచ్చినప్పటికీ అంగన్వాడీలు ఆందోళన( Anganwadis Strike ) విరమించకపోవడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది.