ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు వైసీపీ ప్రభుత్వానికి మధ్య చాలాకాలం నుంచి పరోక్ష యుద్ధం జరుగుతోంది.నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎన్నికలకు వెళ్ళకూడదనే వైఖరితో వైసీపీ ప్రభుత్వం ఎన్నో రకాల ఎత్తుగడలు వేసింది.
అయినా చివరకు కోర్టుల జోక్యంతో ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకవైపు ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.
మరోవైపు పెద్ద ఎత్తున ఏకగ్రీవ లను వైసీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వస్తోంది.అయితే ఈ వ్యవహారాలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించినట్లు కనిపించారు.
గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు వైసీపీ కి రావడంతో వాటిని ఆయన నిలిపివేశారు.చివరికి ఆ ఏకగ్రీవాలకు అంగీకారం తెలిపారు.
ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా నిమ్మగడ్డ ప్రయత్నిస్తుండగా దానికి బదులుగా ఆయన ను ఇరుకున పెట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూ, ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే విధంగా వ్యవహరిస్తూ వస్తుండడం కొంతకాలంగా చేసుకుంటూనే వస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఇద్దరు మంత్రుల విషయంలో సభా హక్కుల నోటీసు లు సైతం ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవ్వడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పుడు మాత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వంతో రాజీ పడినట్లుగా వ్యవహరిస్తున్నారు.ఏకగ్రీవ లకు ఆమోదం తెలుపుతున్నారు.
ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నను అన్నట్లుగానే ఆయన ప్రవర్తన కనిపిస్తోంది.ఎప్పుడూ లేని విధంగా టిడిపి అధినేత చంద్రబాబు సైతం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించడంలో విఫలమైంది అనే వరకు పరిస్థితి వెళ్లడంతోనిమ్మగడ్డ ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం చెలరేగింది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు దీనికి ముఖ్య కారణం గవర్నర్ జొక్యమేనని తెలుస్తోంది.ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఈ విషయంలో రాజీ చేసినట్లు, ప్రభుత్వ సహకారం లేకుండా రాబోయే రోజుల్లో ఎన్నికలు సజావుగా నడిపించడం సాధ్యమయ్యే పని కాదని చెప్పినట్లు తెలుస్తోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం మార్చి చివరినాటికి పదవి విరమణ చేయబోతుండటం తో, గౌరవప్రదంగానే రిటైర్డ్ అవ్వాలని చూస్తున్నారు.అందుకే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అలాగే వైసిపి పెద్దలు సైతం మంత్రులు ,ఎమ్మెల్యేలకు నిమ్మగడ్డ వ్యవహారంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని, ఆయనపై విమర్శలు చేయవద్దని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.అలాగే త్వరలో జరగబోయే మున్సిపల్ , ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో సైతం నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే జరగబోతుండడం తో వీరి మధ్య వివాదం ఒక కొలిక్కి రావడం కారణంగానే ఇదంతా అని అంతా భావిస్తున్నారు.