మారుతున్న కాలంతో పాటుగా మనుషులు మారారు.అందుకే వారి ఆనందం కోసం ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు.
ముఖ్యంగా పుట్టినరోజు వేడుకలకు లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్లు చేసుకునే వారు ఉన్నారు.అయితే ఇలాంటి వారందరితో పాటుగా, నేటి యువతకు కూడా ఓ చిన్నారి ఛాలెంజ్ విసిరింది.
ఇలా మీరు ఖర్చు పెట్టే ఆ డబ్బులతో నిరుపేదలకు సహాయం చేయమని పేర్కొంటుంది.ఆ వివరాలు చూస్తే.
సుల్తానాబాద్ మండల కేంద్రం ద్వారాకనగర్ లో నివాసముంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ కు 13 సంవత్సరాల వయస్సున్న కూతురు ఉంది.ఆమె పేరు జ్యోషిక.
అయితే ఈ అమ్మాయి తన పుట్టినరోజున దుబార ఖర్చు చేయకుండా బోజన్నపేట గ్రామంలో కాలు కోల్పోయి బాధ పడుతున్న, మల్లారపు మల్లయ్య ఇంటికి వెళ్ళి 3500/- రూపాయలు మెడికల్ ఖర్చుల కొరకు వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిందట.
ఈ సంధర్భంగా జ్యోషిక మాట్లాడుతూ సిస్టర్స్ & బ్రదర్స్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను.
రాజకీయ నాయకుల మరియు సినిమా హీరోల ఛాలెంజ్ లే కాకుండా నా ఛాలెంజ్ కూడా స్వీకరించాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.మీ పుట్టినరోజు రోజున పార్టీలు అంటూ ఖర్చు పెట్టె డబ్బులు నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని వేడుకున్నారు.
ఇకపోతే ఇప్పటి వరకు నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి లాక్‌డౌన్ నుండి మేము దాచుకున్న డబ్బులు మరియు దాతల సహాయంతో 405 మంది పేదవారికి సహాయం చేసాము.పంచితే కలిగేది పుణ్యము, ఖర్చుచేస్తే వచ్చేది ఆనందము.
ఇది ఒక్క రోజులో పోతుంది.అందుకే మానవత్వంతో ఆలోచించండి అని ప్రార్దిస్తుంది.
మరి ఈ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఎందరికి ఉందో.!
.