ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu ) జనసేనలోకి ( Janasena ) వెళ్లనున్నారని తెలుస్తోంది.ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో( Pawan Kalyan ) అంబటి రాయుడు సమావేశం అయ్యారు.
అయితే గత కొన్ని రోజుల కిందట వైసీపీలోకి( YCP ) వెళ్లిన అంబటి రాయుడు వారం రోజుల అనంతరం పార్టీని వీడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే దుబాయ్ లో జరగనున్న ఇంటర్నేషనల్ లీగ్ – ILT20 లో పాల్గొనేందుకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అయితే తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ తో ఆయన సమావేశం కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.