ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తున్నాయి.
ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.ఇక త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల కు సంబంధించి అభ్యర్థులను నిలబెట్టే విషయంలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి( TDP ) తమకు బలం లేకపోయినా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో అధికార పార్టీ వైసీపీ టిడిపి వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు స్పీకర్ ద్వారా నోటీసులు జారీ చేయించింది.

ముఖ్యంగా అనర్హత పిటిషన్ వ్యవహారం లో వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం( Tammineni Sitaram ) నోటీసులు జారీ చేశారు.ఈనెల 12వ తేదీన దీనిపై విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఈసారి పూర్తిస్థాయిలో పార్టీ ఫిరాయింపులపై వివరణ తీసుకున్న దానిపై నిర్ణయం ప్రకటించే ఆలోచనతో స్పీకర్ ఉన్నారు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి ,ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( Kotamreddy Sridhar Reddy ) పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో వీరికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు.

వీరు ఈనెల 12వ తేదీన విచారణకు హాజరై తమ వివరణ ఇస్తే దానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం వెలువడాల్సి ఉంది.అయితే వారు ఈ నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికే జనసేన, టిడిపి( Janasena, TDP ) నుంచి వైసీపీకి అనుబంధంగా కొనసాగుతున్న ఎమ్మెల్యేల విషయంలోనూ స్పీకర్ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.వీరి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది అన్ని పార్టీలకు ఒక్కంట కలిగిస్తుంది.