వైసీపీ లో గ్రూపుల లొల్లి ! అన్ని చోట్లా ఇదే తంతు ?

ఒకవైపు సంక్షేమ పథకాలు,  మరోవైపు జనరంజక పాలన అందించాలనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ గట్టిగా కష్టపడుతున్నారు.

పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరంతరం ఇదే అంశంపై ఆయన దృష్టి పెట్టారు.

మళ్లీ 2024 లోనూ వైసీపీ జెండా ఎగురవేసే విధంగా జగన్ కష్టపడుతున్నారు.అందుకే ఆర్థకంగా ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్న, సొంత పార్టీ నాయకుల వ్యవహారం జగన్ కు చికాకు కలిగిస్తోంది.

  ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఎక్కడా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వంటి కారణాలతో ఒకరిపై మరొకరు ఆధిపత్య ధోరణి ప్రదర్శించేందుకు ప్రయత్నించడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది.ఈ గ్రూపు రాజకీయాలపై ఎన్నిసార్లు పార్టీ నేతలకు క్లాస్ పీకినా, పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఏం చేయాలనే విషయంలో జగన్ సైతం సందిగ్ధంలో ఉన్నారు.

ఇక రోజు రోజుకు పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం,  రాబోయే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కేలా ఇప్పటినుంచే కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తూ,  సిట్టింగ్ ఎమ్మెల్యే లను లెక్క చేయకపోవడం ఇలా ఎన్నో అంశాలు వైసీపీలో ఇప్పుడు వివాదాస్పదంగా మారుతున్నాయి.జగన్ కు అత్యంత సన్నిహితురాలైన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం ఇప్పుడు ఈ గ్రూప్ పాలిటిక్స్ ల దెబ్బ కు నియోజకవర్గంలో సొంత పార్టీలోని అసమ్మతి వర్గం పై చేయి సాధించేందుకు ప్రయత్నించడం, తనకు వ్యతిరేకంగా ఉన్న రెండు మూడు గ్రూపులు కలిసి ఉమ్మడిగా ఇప్పుడు తనను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు చేయడం వంటివి రోజాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.

Advertisement

ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో రోజా ను టీడీపీకి చెందిన వ్యక్తి గానే వైసీపీ లోని రోజా ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తున్నాయి.ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు ఈనెల 21న కావడం తో భారీగా ఆయన జన్మదినాన్ని నిర్వహించేందుకు ఒకపక్క రోజా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తుండగా,  మరోపక్క ప్రత్యర్థి వర్గం విడిగా జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇదే విషయమై నిన్న రోజా భర్త సెల్వమణి అసమ్మతి వర్గం, నాయకులు విడివిడిగా ఆత్మీయ  సమావేశాలు నిర్వహించారు.ఈ సందర్భంగా జగన్ పుట్టినరోజు వేడుకల నిర్వహణ పై చర్చించారు.

రోజా భర్త నిర్వహించిన సమావేశంలో పూర్తిగా జగన్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన చర్చ జరగగా , ప్రత్యర్ది వర్గం మాత్రం రోజా నుంచి తనకు ఎదురవుతున్న ఇబ్బందులు వంటి వాటిపైన చర్చించారట.ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయట.ఇలా చెప్పుకుంటూ వెళితే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి వైసీపీలో నెలకొంది.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు