కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలి - కేంద్రాల తనిఖీలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సూచించారు.తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల, అంకుసాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సోమవారం పరిశీలించారు.

 Additional Collector Khemya Naik Inspects The Purchase Centres, Additional Colle-TeluguStop.com

ఆయా కేంద్రాల్లో వసతులను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.అనంతరం తంగళ్లపల్లిలోని సప్తగిరి ఇండస్ట్రీని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.దళారులకు అడ్డుకట్ట వేసేందుకు, రైతులకు మద్దతు ధర అందించేందుకు ఈసారి ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని వెల్లడించారు.

రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని కేంద్రాలకు తరలించాలని సూచించారు.ప్రభుత్వం  గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2203, గ్రేడ్ బీ రకానికి రూ.2183 నిర్ణయించిదని వెల్లడించారు.  రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని తెలిపారు.  జిల్లాలోని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని, దళారులకు ధాన్యం విక్రయించవద్దని కోరారు.

ఇక్కడ జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube