ఇంట్లోనే సహజ సిద్ధంగా కొరియన్ గ్లాస్ స్కిన్ ఎలా పొందాలో తెలుసా..?

ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు చర్మం సంరక్షణపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.ముఖ్యంగా ఆడవారు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల ఫేస్ మాస్కులు, బ్యూటీ ప్రొడక్ట్స్( Beauty Products ) లను ఉపయోగిస్తూ ఉన్నారు.

 Home Remedy To Get Korean Glass Skin,korean Glass Skin,beauty Tips,rice,porridge-TeluguStop.com

మరి కొంతమంది బ్యూటీ పార్లర్ లకు వెళ్లి వేలల్లో ఖర్చు చేస్తూ ఉన్నారు.అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది కొరియన్ గ్లాస్ స్కిన్ పై ఆసక్తి చూపిస్తూ ఉన్నారు.

కొరియన్ గ్లాస్ స్కిన్( Korean Glass Skin ) పై రీల్స్ వీడియోలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.అయితే ఈ గ్లాస్ స్కిన్ కోసం మీరు ఏంలాంటి ప్రొడక్ట్స్, మాస్క్ లపై ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే మీరు సహజ సిద్ధంగా ఈ మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

Telugu Tips, Remedykorean, Pimples, Porridge, Skin-Telugu Health

గంజినీటినీ చర్మానికి టోనర్ గా ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా స్పష్టంగా మెరిసేలా చేస్తుంది.దీనిని కొరియన్ మహిళలు ఫేస్ మాస్క్ లా ఉపయోగిస్తారు. గంజినీటి( Porridge )లో ఎన్నో యాంటీ లక్షణాలు ఉంటాయి.ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.ఇవి చర్మంపై కలిగే మచ్చలు, మొటిమలను( Scars,Pimples ) దూరం చేస్తాయి.ఈ గంజి నీటితో చర్మంను శుభ్రం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.

ముఖ్యంగా మొటిమలు, మచ్చలు చర్మంపై కలిగే చికాకు వంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే స్కిన్ ను మృదువుగా సిల్క్ లాంటి అనుభూతిని కలిగిస్తుంది.

గంజినీళ్ళతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.అలాగే ఈ నీటి వల్ల చర్మం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంటుంది.

కొరియన్ గ్లాస్ స్కిన్ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Remedykorean, Pimples, Porridge, Skin-Telugu Health

కొరియన్ గ్లాస్ స్కిన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బియ్యం, మూడు కప్పుల నీరు ఉంటే సరిపోతుంది.ముందుగా బియ్యాన్ని( Rice ) కడిగి ఒక పాత్రలో నీరు పోయాలి.ఆ తర్వాత మంట మీద పెట్టి ఆ నీరు మరిగే వరకు ఉడికించాలి.

నీరు మరిగిన తర్వాత ఆ మంట తగ్గించి ఒక 15 నిమిషాల పాటు ఉడికించాలి.చల్లబడేలా చేయాలి.గంజిని శుభ్రమైన సీసాలో వడగట్టి ఫ్రిజ్లో నిల్వ చేయాలి.ఈ విధంగా దీనిని తయారు చేసుకోవచ్చు.

అలాగే ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ గంజి నీటిని ఒక కంటెంట్ పాడ్ లో ముంచి ముఖం శుభ్రం చేసుకోవాలి గంజినీటిని ఫేస్ మిస్ట్ గా కూడా ఉపయోగించవచ్చు.గంజిని ఫేస్ మాస్క్ లో ఒక పదార్థంగా ఉపయోగించాలి.

ఈ విధంగా మీరు చేస్తూ ఉంటే అందమైన, కాంతివంతమైన గ్లాస్ స్కిన్ ను పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube