టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.అయితే గత కొన్నేళ్లుగా అనుపమ నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోవడంతో పాటు ఈ నటికి సినిమా ఆఫర్లు కూడా తగ్గడం గమనార్హం.2022 సంవత్సరంలో అనుపమ పరమేశ్వరన్ నటించిన రౌడీ బాయ్స్ సినిమా రిలీజ్ కానుంది.అశీష్ అనే కొత్త హీరోకు జోడీగా ఈ సినిమాలో అనుపమ నటించారు.
స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లను అందిపుచ్చుకోలేకపోయిన అనుపమ మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా ఎక్కువ సినిమాలలో నటించారు.మరోవైపు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో గ్లామరస్ రోల్స్ కు తాను దూరమని చెప్పిన అనుపమ పరమేశ్వరన్ గతేడాది నుంచి సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
గతంలో లిప్ లాక్ సీన్లు ఉన్నాయని ఈ బ్యూటీ ఒక సినిమాను రిజెక్ట్ చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే రౌడీ బాయ్స్ మూవీలో మాత్రం అనుపమ పరమేశ్వరన్ లిప్ లాక్ సీన్లలో నటించడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా ఆఫర్ల కోసం అనుపమ పరమేశ్వరన్ రూటు మార్చారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.జనవరి 14వ తేదీన రౌడీ బాయ్స్ సినిమా విడుదల కానుండగా ఈ సినిమాతో అయిన అనుపమ కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అనుపమ కెరీర్ పై ఆ ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుందని చెప్పవచ్చు.నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.కొన్ని నెలల క్రితమే షూటింగ్ పూర్తైనా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురు చూసిన దిల్ రాజు సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.