చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో చిరంజీవి( Chiranjeevi ) లాంటి నటుడు మాత్రం భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.ఇక 70 సంవత్సరాల వయసులో కూడా ఎక్కడ తడబడకుండా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్న చిరంజీవి భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని సినిమాలు చేస్తున్నాడు.

ఇక మే 9 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ అనౌన్స్ చేసినప్పటికి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సమ్మర్ కానుకగా ఈ సినిమా అనుకున్న డేట్ కి వచ్చే విధంగా అయితే కనిపించడం లేదు.అయితే ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో చాలా వరకు లేట్ అవుతుందట.దానివల్ల ఈ సినిమా మరోసారి లేటయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి.మరి ఏది ఏమైనా కూడా సినిమా యూనిట్ నుంచి వస్తున్న టాక్ ను బట్టి చూస్తే సినిమా అద్భుతంగా వచ్చిందని భారీ సక్సెస్ ని సాధించడం పక్కా అంటూ తెలియజేస్తున్నారు.

ఈ సినిమా అవుట్ ఫుట్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో మరికొన్ని రోజులు పాటు సినిమా రిలీజ్ లేటైన పర్లేదు కానీ సూపర్ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఈ సినిమాని పోస్ట్ పోన్ చెయ్యాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు చాలామంది దర్శకులు చిరంజీవిని డిఫరెంట్ లుక్ లో ప్రజెంట్ చేశారు.కానీ ఇప్పుడు వశిష్ట( Vasishta ) మాత్రం చిరంజీవికి డిఫరెంట్ మేకోవర్ ని అందించి తనను నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి రాబోయే సినిమాలతో మెప్పిస్తాడా? లేదా అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…