ముస్తాబాద్ లోని మహర్షి హై స్కూల్ గుర్తింపు రద్దు

రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్(Mustabad) లో ఉన్న మహర్షి హై స్కూల్ (Maharshi High School) గుర్తింపు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.ముస్తాబాద్ మండల విద్యాశాఖ అధికారి అందించిన నివేదిక ప్రకారం నర్సరీ చదువుతున్న చిన్నారి మనోజ్ఞ,తండ్రి పేరు భూమయ్య ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు టైర్ కిందపడి అక్కడికక్కడే మరణించిందని, ఈ సంఘటన స్కూల్ బస్ డ్రైవర్(School bus driver) నిర్లక్ష్యపు డ్రైవింగ్, మహర్షి హై స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యపు వైఖరి కారణంగా జరిగిందని తేలింది.

 Derecognition Of Maharshi High School, Mustabad, Mustabad, Maharshi High School,-TeluguStop.com

సుప్రీంకోర్టు (Supreme Court)ఉత్తర్వుల ప్రకారం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్, పి.డబ్ల్రూ.డి శాఖ నుంచి భవన స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ ఉండాలని, మహర్షి హై స్కూల్ మేనేజ్మెంట్ పేర్కొన్న సర్టిఫికెట్లు సబ్మిట్ చేయలేదని అన్నారు.

పాఠశాల వాహనం పార్కింగ్ , మెయింటెనెన్స్ అంశంలో రవాణా శాఖ (Department of Transport)జారీ చేసిన మెమోలోని సూచనలు , మార్గదర్శకాలను మహర్షి హై స్కూల్ యాజమాన్యం పాటించలేదని, పిల్లల రవాణా సమయంలో స్కూలు యాజమాన్యం పాటించాల్సిన జాగ్రత్తలు సైతం పాటించడంలో వైఫల్యం చెందారని, దీని కారణంగా ఒక పసి ప్రాణం చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని అన్నారు.

Telugu Transport, Maharshi Schoo, Maharshischool, Maharshi School, Mustabad, Sup

మహర్షి హై స్కూల్ కు సరైన బిల్డింగ్ అనుమతులు సర్టిఫికెట్ లేవని , రవాణా సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు పాటించడం లేదని, పాఠశాలలోని పిల్లలకు సిబ్బంది ప్రాణాలకు ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ముస్తాబాద్ లోని మహర్షి హై స్కూల్ గుర్తింపు వెంటనే రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి(Education Officer) ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube