ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా (social media)వినియోగం పెరిగిన కొద్దీ చాలామంది అదే సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్ర విచిత్రమైన పనులు చేస్తున్నారు.ఇలాంటి సమయంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
మరికొందరైతే ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే చివరికి ఏదో జరుగుతూ ఉంటుంది.ఇలాంటి అనేక విచిత్ర సంఘటనకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.ఓ వ్యక్తి అతనితోపాటు ఉన్న యువకుల మధ్య హీరో అవ్వాలని అనుకున్నాడు.
కాకపోతే, అతడు చేసిన పనికి చివరికి జీరోల అయ్యాడు.ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే.
ఓ వ్యక్తి తన స్నేహితులతో స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో ఓ ప్రాంతం లో రోడ్డు ఖాళీగా ఉన్న ప్రాంతాన్ని ఎంఐపిక చేసుకొని.అక్కడ బైక్ లను అడ్డుపెట్టి స్టంట్స్ చేయాలని అనుకున్నాడు.అయితే అందరి ముందు హీరోల బిల్డప్ ఇస్తూ.బైకులపై విచిత్ర విన్యాసం చేయాలని అనుకున్నాడు.కానీ., అతడు పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డుపై అడ్డంగా ఉన్న మూడు బైకులను వరుసగా పార్కు చేసి ఉన్న దాని నుంచి అవతల వైపు దూకెందుకు ప్రయత్నం చేశాడు.
అయితే, ఆ యువకుడు అలా చేయడంలో పొరపాటు జరిగింది.దాంతో మూడు బైకులను దాటి ముందు పడ్డాడు కానీ.
బొక్క బోర్ల పడడంతో అక్కడ ఉన్న వారి స్నేహితులు(Friends) అతనిని కాపాడేందుకు ముందుకు రావడంతో వీడియో అయిపోతుంది.చివరకు అతడు కింద ఉన్న సమయంలో నొప్పితో అల్లాడుతున్నట్లుగా వీడియోలో కనబడుతుంది.
ఇక ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ రూపంలో రకరకాలుగా స్పందించారు.ఏదో చేయాలని చూస్తే చివరకు ఇంకేదో జరిగిందంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.మరి కొందరేమో ఇలాంటి విన్యాసాలు కేవలం నిపుణులకు సమక్షంలో మాత్రమే చేయాలంటూ కామెంట్ చేస్తున్నారు.ఏదిఏమైనా ఇలాంటి డేంజరస్ స్టంట్స్ చేసే ముందు కాస్త జాగ్రత్తగ ఉండటం మంచిది.