ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar )హత్య వెనుక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ గతేడాది కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.భారత్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో సైలెంట్ అయిన ట్రూడో తాజాగా మరోసారి దుందుడుకు చర్యలకు దిగుతున్నారు.
ఈసారి ఏకంగా కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Verma )ను నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో చేర్చింది.ఇండియాపై ఆంక్షలు విధించేందుకు సైతం ఆయన సిద్ధమవుతున్నారు.
దీనిపై భారత్ భగ్గుమంది.ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమీషనర్‌ను పిలిచి నిరసన వ్యక్తం చేయడంతో పాటు దౌత్య సిబ్బందిని బహిష్కరించింది.
ఈ నేపథ్యంలో గతంలో నిజ్జర్ హత్యపై కేవలం నిఘా వర్గాల సమాచారం మేరకే భారత్‌పై ఆరోపణలు చేశానని.కానీ ఇప్పుడు తమ వద్ద విశ్వసనీయ ఆధారాలున్నాయని ట్రూడో పేర్కొన్నారు.కెనడియన్ల సమాచారాన్ని భారత దౌత్యవేత్తలు స్వీకరించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి అందజేశారని ఆయన ఆరోపించారు.కెనడా ఎన్నికల్లో విదేశీ జోక్యంపై ఏర్పాటు చేసిన కమిటీ ఎదుట ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.
దీంతో కెనడా ప్రధాని తనకు తానుగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయ్యింది.
ఆ వెంటనే భారత్ స్పందించింది.నిజ్జర్ హత్య వెనుక భారత్ ఉంది అనడానికి కేవలం నిఘా సమాచారమే తప్పించి ఆధారాలు లేవని ట్రూడో( Justin Trudeau )నే అంగీకరించారని భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ( Randhir Jaiswal )పేర్కొన్నారు.ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇలా దిగజారడానికి ట్రూడోనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలో కెనడాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.ట్రూడో ప్రకటన భారత్ కథనానికి పెద్ద విజయమన్నారు.ప్రధాని చేతలకు, మాటలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదన్నారు.