ఏమయిందిరా.. 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ (India, New Zealand)మొదటి టెస్ట్ లో భాగంగా మొదటి రోజు వర్షం కారణంగా పూర్తి ఆట రద్దుకాగా.రెండో రోజు టాస్ గెలిచిన టీం ఇండియా (Team India) బ్యాటింగ్ చేసింది.

 What Happened Team India Collapsed For 46 Runs, Teamindia, India 46, New Zealand-TeluguStop.com

అయితే టీమిండియా బ్యాటర్లకు ఏమైందో ఏమో తెలియదు కానీ వరుస పెట్టి పెవిలియన్ చేరారు.ఇందులో భాగంగా ఏకంగా ఐదు మంది టీమిండియా బ్యాట్స్మెన్లు డక్ అవుట్ అయ్యారు.

వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన 20 పరుగులు ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఓ బ్యాట్స్మెన్ చేసిన పరుగులు.టీమిండియా కేవలం 31.2 ఓవర్లలో 46 పరుగులకే కుప్పకూలింది.

Telugu Bengaluru, India, India Zealand, Kl Rahul, Zealand, Ravindra Jadeja, Rohi

ఇది ఇలా ఉండగా.టీమిండియాలో మొత్తం ఐదుగురు బ్యాట్స్మెన్స్ ఖాతా తెరవకుండానే వెను తిరిగారు.ముఖ్యంగా సొంత గ్రౌండ్ గా భావించే విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

టీమిండియా స్కోర్ 9 పరుగుల వద్ద రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం రెండు పరుగులతో పెవిలియన్ చేరినప్పటి నుంచి మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత కొనసాగుతూనే ఉంది.ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, కె.ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవీంద్రన్ అశ్విన్ (Sarfaraz Khan, KL Rahul, Ravindra Jadeja, Ravindran Ashwin)అందరూ డక్ అవుట్ అయ్యారు.బంగ్లాదేశ్ సిరీస్లో సెంచరీ సాధించిన రవిచంద్రన్ అశ్విన్ కూడా గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు.

Telugu Bengaluru, India, India Zealand, Kl Rahul, Zealand, Ravindra Jadeja, Rohi

ఇక మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లు(New Zealand bowlers) టీమిండియా ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టారు.ముగ్గురు ఫేస్ బౌలర్లు టీమిండియా పతనానికి కారణమయ్యారు.ముఖ్యంగా మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనానికి కారకుడయ్యాడు.అలాగే విలియం రూట్ కూడా నాలుగు వికెట్లు తీయగా.టీం సౌతి ఒక వికెట్ తీశాడు.దీంతో నేడు టీమిండియా టెస్టుల్లో మూడో అత్యల్ప స్కోరును నమోదు చేసుకుంది.

ఇదివరకు 2020లో ఆస్ట్రేలియాతో 36 పరుగులకు, 1974లో ఇంగ్లాండ్తో 42 పరుగులకు టీమిండియా ఆల్ అవుట్ అయింది.చూడాలి మరి టీమిండియా బౌలర్లను న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ ఎలా ఎదుర్కొంటారో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube