రాజన్న సిరిసిల్ల :పాము కాటు వేసిన విద్యార్థిని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పరామర్శించారు.శుక్రవారం ఇల్లంతకుంట మండలం గాలి పల్లి గ్రామంలోని బిసి సంక్షేమ హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న రామావత్ రోహిత్ అనే 12 సంవత్సరాల విద్యార్థి కుడి చేతి పై ప్రమాదవశాత్తు నాగుపాము కాటు వేసింది.
బాలుడిని కుట్టిన నాగపామును గ్రామస్తులు గుర్తించి చంపి వేయడం జరిగిందన్నారు.రోహిత్ నాగుపాము కాటు వేయడం , అస్వస్థకు గురికావడం గమనించిన హాస్టల్ సిబ్బంది వెంటనే ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
అనంతరం విద్యార్థికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో పాము కాటు చికిత్సను అందించారు.బాలుని కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడిని పరామర్శించిన అదనపు కలెక్టర్, బాలుని ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు.ప్రమాదం నుండి బాలుడు కోలుకుంటున్నాడని, బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ వైద్యులకు సూచించారు.
అదనపు కలెక్టర్ వెంట బీసీ వెల్ఫేర్ అధికారి మనోహర్రావు, ఎల్లారెడ్డిపేట తహాసిల్దార్ రామచంద్రం,సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు
.