రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో టిబి వ్యాధిని పూర్తిగా నిర్మూలన, టీబీ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల ను మార్చడమే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ లక్ష్యం అని టిబి ఆలర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ జిల్లా అధికారి దండుబోయిన శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చందుర్తి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మల్యాల సబ్ సెంటర్, సనుగుల సబ్ సెంటర్ లో టీబీ నివారణ పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అధిక సంఖ్యలో కేసులు మన ఇండియాలోనే నమోదు అవుతున్నాయని, దీని ద్వారా మరణాల సంఖ్య కూడా అధికంగా వున్నయాని, టీబీ అనే మహమ్మారని ప్రజల నుంచి దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఐదు జిల్లాలను ఎంపిక చేసిందని అందులో సిరిసిల్ల జిల్లా కుడా ఒకటని అన్నారు.అయితే టీబీ బారిన పడి ఆ వ్యాధిని జయించిన వారిని టీబీ చాంపియన్ గా గుర్తించి వారికి శిక్షణ నిర్వహించి వారి ద్వారా వ్యాధి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ శశికల, ఎం ఎల్ హెచ్ పి లు, డా.ఐశ్వర్య & నవీన్, సూపర్వైజర్ గంగాధర్, ఏఎన్ఎం లు రమాదేవి, పద్మ, మమత, ఆశ వర్కర్లు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.