ఆనపకాయ( bottle gourd ) అనగానే చాలా మందికి ఫేసులో ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటాయి.పిల్లలే కాదు పెద్దల్లో సైతం ఎంతో మంది ఆనపకాయ తినేందుకు ఆసక్తి చూపరు.
కానీ ఆరోగ్యానికి ఆనపకాయ కొండంత అండగా నిలుస్తుంది.ఆనపకాయను సొరకాయ అని కూడా పిలుస్తారు.
నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయల్లో ఆనపకాయ ముందు వరుసలో ఉంటుంది.ఆనపకాయలో కాల్సియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
అలాగే ఆనపకాయలో పీచు పదార్థం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి.వారానికి కేవలం ఒక్కసారి ఆనపకాయను తిన్న కూడా బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.
ముఖ్యంగా కాలేయ ఆరోగ్యానికి ఆనపకాయ ఎంతో మేలు చేస్తుంది.ఆనపకాయలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి మరియు టాక్సిన్స్ వల్ల కలిగే నష్టం నుండి కాలేయ కణాలను రక్షిస్తాయి.అదే సమయంలో ఆపనకాయ శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయంపై భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
అలాగే ఆనపకాయలో సోడియం తక్కువగా, మంచి మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో ఉత్తమంగా తోడ్పడుతుంది.తరచూ అధిక రక్తపోటు( High Blood Pressure )తో బాధపడేవారు ఆనపకాయను డైట్ లో చేర్చుకోవడం బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.ఆనపకాయలో ఫైబర్ మరియు వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల ఇది ఆరోగ్యకరమైన మరియు సమర్థవంతమైన జీర్ణవ్యవస్థకు దోహదపడుతుంది.ఆనపకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో మరియు రోగనిరోధక వ్యవస్థ( Immune System )ను బలపరచడంలో తోడ్పడతాయి.అంతేకాదు ఆనపకాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది.
శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్లో ఉంటుంది.
మూత్రనాళ సంబంధ వ్యాధులు దూరం అవుతాయి.తక్కువ కేలరీల ఆహారాన్ని కోరుకునే వారికి కూడా ఆనపకాయ ఉత్తమమైన ఎంపిక అవుతుంది.