సింగపూర్ : మోసాన్ని తట్టుకోలేక ..ప్రియురాలిని కొట్టి కొట్టి చంపాడు, భారత సంతతి వ్యక్తికి 20 ఏళ్ల జైలు

పరాయి వ్యక్తులతో సంబంధాలు కలిగి వుందన్న కక్షతో తన ప్రియురాలిని హత్య చేసిన ఘటనలో భారత సంతతికి చెందిన వ్యక్తికి సోమవారం సింగపూర్ కోర్ట్( Singapore Court ) 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.ఇతర పురుషులతో ఆమెకు వున్న సంబంధాల గురించి తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురైన నిందితుడు ఎం కృష్ణన్( M Krishnan ) జనవరి 17, 2019న మల్లికా బేగం రహమాన్సా అబ్దుల్ రెహమాన్‌ (40)ని( Mallika Begum Rahamansa Abdul Rahman ) కొట్టాడు.

 Singapore Indian-origin Married Man Jailed For Beating Girlfriend To Death Over-TeluguStop.com

గతవారం కృష్ణన్ హైకోర్టులో ఈ నేరాన్ని అంగీకరించినట్లు ‘‘టుడే’’ వార్తాపత్రిక సోమవారం నివేదించింది.

కృష్ణన్‌కు ఎక్స్‌ప్లొజివ్ డిజార్డర్‌తో పాటు మద్యం సేవించే అలవాటు కారణంగా హింసాత్మక చర్యలకు దిగుతున్నాడని జస్టిస్ వాలెరీ థియాన్( Justice Valerie Thean ) అన్నారు.

మహిళలపై పదే పదే గృహహింసకు పాల్పడటాన్ని తాను ఉపేక్షించలేనంటూ కృష్ణన్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు.నవంబర్ 2015లో కృష్ణన్ భార్య అతనిని, అతని స్నేహితురాలిని వారి ఇంట్లోని మాస్టర్ బెడ్‌రూమ్‌లో మద్యం సేవిస్తుండగా పట్టుకుంది.

Telugu Girlfriend, Relationships, Indian, Indian Jailed, Valerie Thean, Krishnan

కృష్ణన్‌ను ఆమె అసభ్యపదజాలంతో దూషించడంతో కోపద్రిక్తుడైన అతను భార్య ముఖంపై కొట్టాడు.తనపై విస్కీ బాటిల్‌తో దాడి చేస్తాడని భయపడిన ఆమె అతనికి క్షమాపణలు చెప్పింది.అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.కృష్ణన్ , మల్లిక చనిపోయే వరకు వారి సంబంధాన్ని కొనసాగించారు.2017లో మల్లికను కృష్ణన్ పదే పదే కొట్టినట్లుగా కోర్టు పత్రాలు పేర్కొన్నాయి.2018లో కృష్ణన్ జైలులో వున్నప్పుడు పలువురు పురుషులతో మల్లిక లైంగిక సంబంధాలు పెట్టుకున్నట్లుగా నివేదిక తెలిపింది.ఈ క్రమంలో జనవరి 15, 2019న మల్లికను కృష్ణన్ తీవ్రంగా కొట్టాడు.తనను విడిచిపెట్టొద్దని ప్రాధేయపడినప్పటికీ పట్టించుకోని నిందితుడు .మల్లికను మెడ పట్టుకుని గెంటేశాడు.ఆమె కిందపడిపోగా తలని వార్డ్‌రోబ్‌కు కొట్టాడు.

Telugu Girlfriend, Relationships, Indian, Indian Jailed, Valerie Thean, Krishnan

తర్వాతి రోజు మల్లికను ఆసుపత్రిలో చేర్చిన కృష్ణన్.రోజంతా మద్యం సేవిస్తూనే వున్నాడు.మల్లిక సంబంధాలపై మరిన్ని విషయాలు తెలుసుకున్న కృష్ణన్ ఆమెపై మళ్లీ దాడి చేశాడు.ఈ క్రమంలో మల్లిక స్పృహతప్పి పడిపోవడంతో తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టాడు.అయితే ఆమె శ్వాస తీసుకోకపోవడంతో భయపడి సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్‌కు( Singapore Civil Defence Force ) సమాచారం అందించారు.ఆమెను పరీక్షించిన వైద్యులు మరణించినట్లుగా ప్రకటించారు.

పోస్టుమార్టం రిపోర్టులో మల్లిక తలకు గాయమై చనిపోయిందని, మెడ వెనుక, ముఖం, శరీరం మొత్తం గాయాలయ్యాయని తేలింది.మల్లికపై దాడి తర్వాత స్నేహితుడి ఇంట్లో ఆశ్రయం పొందిన కృష్ణన్ జనవరి 17, 2019న మధ్యాహ్నం స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube