ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) సంచలన విషయాలు బయటకు వచ్చాయి.విచారణలో భాగంగా హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్యాపింగ్ సెంటర్లు( Tapping Centres ) ఏర్పాటైనట్లు గుర్తించారు.
అలాగే నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మానిటరింగ్ సెంటర్లతో పాటు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని గెస్ట్ హౌజ్ లో ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటైనట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్( Hyderabad ) ఎస్ఐబీ కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ లో( Jubilee Hills ) ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటైందని తెలుస్తోంది.
ఈ ట్యాపింగ్ ను అదునుగా తీసుకుని సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు నిర్ధారించారని సమాచారం.అంతేకాకుండా కొందరు నేతల కనుసన్నల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు గుర్తించారు.ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది.