రీసెంట్ గా చిరంజీవి( Chiranjeevi ) సావిత్రి క్లాసిక్స్( Savitri Classics ) అనే బుక్ ని లాంచ్ చేసే ఈవెంట్ కి ముఖ్య అతిధి గా హాజరయ్యాడు.అయితే ఈ బుక్ ని రిలీజ్ చేస్తున్న సందర్భంలో చిరంజీవికి సావిత్రి తో ఉన్న అనుబంధాన్ని తెలియజేసాడు.
ముఖ్యంగా ఆయన మొదటి సినిమా అయిన పునాదిరాళ్లు( Punadhirallu Movie ) సినిమాలోనే సావిత్రి గారితో నటించి తొలి సినిమాతోనే సావిత్రి గారి పక్కన ఒక ముఖ్య పాత్రలో చిరంజీవి నటించడం అనేది ఆయన అదృష్టంగా భావిస్తున్నాడు.అయితే ఆ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు అనుకోకుండా వర్షం రావడంతో సినిమా టీమ్ అంత కాలక్షేపం కోసం కూర్చుని మాట్లాడుకుంటుంటే అందులో సావిత్రి గారు చిరంజీవి ని డాన్స్ చేయమని చెప్పారట.
ఇక చిరంజీవి బ్రేక్ డాన్స్ చేస్తూ కింద పడిపోయాడు.అలాగే లేచి డాన్స్ చేయకుండా ఆ కిందపడ్డ దాన్ని కూడా ఫ్లోర్ మూమెంట్స్ లాగా కవర్ చేస్తూ చిరంజీవి డాన్స్ చేయడంతో సావిత్రి గారు( Savitri ) ఒక్కసారి ఆయన పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోయి ఆయన గురించి చాలా గొప్పగా అక్కడ ఉన్న వారందరితో చెప్పిందట.ఇక అదే విధంగా చిరంజీవిని కూడా నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని రాబోయే రోజుల్లో చాలా గొప్ప స్టారు అవుతామని దీవించిందట.ఇక మొత్తానికి అయితే ఆమె చేసిన పనికి చిరంజీవి కూడా ఫిదా అయిపోయాడట.
ఒక స్టార్ హీరోయిన్ ఇలా ఒక కొత్త అబ్బాయిని ఎంకరేజ్ చేయడం అనేది అతనికి బాగా నచ్చిందట.అందుకే అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవి కూడా యంగ్ స్టర్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ల టాలెంట్ ను గుర్తిస్తూ ఉంటాడు.ఈ విషయంలో చిరంజీవికి సావిత్రి గారే ఇన్స్పిరేషన్ అని ఆయన పలు సందర్భాల్లో కూడా తెలియజేశాడు.ఇక మొత్తానికైతే చిరంజీవి చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టింది.
ఇక ప్రస్తుతం ఇప్పుడు ఆయన వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు…
.