నల్లగొండ జిల్లా:హుజూర్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేగా ఉండి, గుర్రంబోడ్ పోడు భూముల విషయంలో గిరిజనుల పక్షాన పోరాడిన బీజేపీ నాయకులపై పోలీసులతో దాడి చేయించి,అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది సైదిరెడ్డి కాదా?అలాగే ఆనాటి రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ధాన్యం కొనుగోలులో నాటి ప్రభుత్వ నిర్లక్ష్యంపై కొనుగోలు కేంద్రాల సందర్శనార్థం హైదరాబాద్ నుండి నల్లగొండ మీదుగా హుజూర్ నగర్ చేరుకునే క్రమంలో బీజేపీ నాయకుల కార్ల అద్దాలను ధ్వంసం చేసి,కార్యకర్తల భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తికి ఎంపి టిక్కెట్ ఎట్లా ఇస్తారని ప్రస్తుత నల్లగొండ బీజేపీ ఎంపి అభ్యర్ధిపై నల్లగొండ జిల్లా కాషాయ లీడర్స్,క్యాడర్ గుస్సా అవుతుండ్రని తెలుస్తుంది.పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని కాదని,పార్టీ మారిన వారికి అవకాశం ఇస్తే ఒరిజనల్ క్యాడర్ పరిస్థితి ఏమిటని గట్టుగానే అరుసుకుండ్రు ఆ పార్టీ జిల్లా నాయకులు పాలకూరి రవిగౌడ్.
నల్లగొండ బీజేపీ ఎంపి అభ్యర్థిగా సైదిరెడ్డి ప్రకటన పట్ల బీజేపి అభిమానులు, బీజేపి శ్రేణులు పూర్తిగా అసహనంతో ఉన్నారని, ప్రకటన వెలువడక ముందు ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉండేదని, ప్రకటించిన తర్వాత పూర్తిగా తారుమారు అయిందంటున్నరు.సొంత నియోజకవర్గంలో కూడా మంచి పేరు లేని వ్యక్తికి ఎంపి టిక్కెట్ ఇస్తే బీజేపీకి ప్రజలు ఓటెట్లా వేస్తారని ప్రశ్నించారు.
అభ్యర్ధిగా సైది రెడ్డి ఉంటే బీజేపీకి భారీ నష్టం జరుగుతుందని,పార్టీ అధిష్టానం పునరాలోచన చేయాలని కోరారు.ఇంతకీ కలమం పార్టీ పెద్దలు సైదిరెడ్డిని సైడ్ చేస్తారా లేక డిసైడ్ చేస్తారా అనేది జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.