DJ Effect : వీడియో వైరల్: డిజె సౌండ్ దెబ్బకి పెళ్లి వేడుకలో గుండెపోటుతో మృతి చెందిన బాలుడు..!

ఈ మధ్యకాలంలో ఏ శుభకార్యమైన సరే డీజే( DJ ) పెట్టడం పరిపాటుగా మారిపోయింది చాలామందికి.తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో( Uttar Pradesh ) జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో డిజె సౌండ్ దెబ్బకి సుధీర్( Sudheer ) అనే 15 ఏళ్ల బాలుడు గుండెపోటు కారణంగా మరణించాడు.

 Uttar Pradesh Boy Died Due To Dj Sound Viral-TeluguStop.com

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఇంట్లో పెళ్లి వేడుకల కారణంగా డీజే ని ఏర్పాటు చేసుకున్నారు.

పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్న సమయంలో డిజె సౌండ్ బాగా ఉంచి రోడ్డుపై వారికి తోచిన విధంగా డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.బంధుమిత్రులతో పాటలకు ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తూ ఉర్రూతలు ఊగుతున్న సమయంలో జరగడానికి సంఘటన ఒకటి జరిగింది.

అప్పటివరకు అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్న సుధీర్ అనే 15 ఏళ్ల బాలుడు ఒక్కసారిగా నేలపై పడ్డాడు.దీంతో అక్కడి వారందరూ ఆ అబ్బాయిని పరిశీలించిన ఎలాంటి అలజడి లేకపోవడంతో వెంటనే వారందరూ అతనిని సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లారు.అక్కడ నుంచి హుటాహుటిగా ఆసుపత్రికి తీసుకువెళ్లిన కూడా అప్పటికే ఆ అబ్బాయి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.అయితే ఈ చావుకి గల కారణం డీజే శబ్దం( DJ Sound ) అంటూ డాక్టర్లు ప్రాథమిక అంచనా వేశారు.

దీంతో పెళ్లికి వచ్చిన అతిధులందరూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు.ఏదేమైనా ఇలాంటి ఎక్కువ డెసిబుల్స్ కలిగిన డీజే సిస్టంలను ఉపయోగించడం ద్వారా ఇలాంటి అనర్ధాలు జరుగుతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.కాబట్టి మీరు కూడా ఇలాంటి వేడుకలు జరిపే సమయంలో వీటిని కాస్త నివారిస్తే మనతోపాటు మన కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇందులో ఆ బాలుడు డాన్స్ చేస్తుండగానే ఒక్కసారిగా కుప్ప కూలడం మనం గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube