త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.తాజాగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు( BRS BSP Alliance ) పెట్టుకుందని తెలుస్తోంది.
ఈ క్రమంలో రానున్న లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయని సమాచారం.
![Telugu Brs Kcr, Bsprs, Kcrrs, Loksabha, Telangana-Latest News - Telugu Telugu Brs Kcr, Bsprs, Kcrrs, Loksabha, Telangana-Latest News - Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/03/BRS-BSP-alliance-finalized-in-Telangana-detailsa.jpg)
పొత్తుపై త్వరలోనే విధివిధానాలను పార్టీ నేతలు ఖరారు చేయనున్నారు.అయితే గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ తో( KCR ) బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) సమావేశం అయిన సంగతి తెలిసిందే.కాగా పొత్తులో భాగంగా బీఆర్ఎస్ మద్ధతుతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.