Naga Babu Budi Mutyala Naidu : మెగా బ్రదర్ ‘ కు ప్రత్యర్థి ఆయనేనా ? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు( Naga Babu ) వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఉత్సాహపడుతున్నారు.గత కొంతకాలంగా జనసేన తరఫున పార్టీ నాయకులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ ,మెగా ఫ్యాన్స్ అందరినీ ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యార.

 Is He The Rival Of Mega Brother Naga Babu-TeluguStop.com

  వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు మెగా ఫాన్స్ అంతా ఏకం అవ్వలంటూ నాగబాబు పదేపదే చెబుతూ కీలకమైన సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా విశాఖ జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు నాగబాబు ప్రయత్నిస్తున్నారు.

ముఖ్యంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నాగబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.ఈ విషయంలో టిడిపి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం,  పవన్ సైతం తన సోదరుడిని అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావిస్తూ ఉండడంతో,  అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పై నాగబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టి తనకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు .

Telugu Anakapallymp, Budi Mutyala, Janasena, Janasenani, Madugula Mla, Brother,

నాగబాబు అక్కడ నుంచి పోటీ చేయడం ఖాయం కావడంతో , అధికార పార్టీ వైసీపీ కూడా నాగబాబును ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలనే పట్టుదలతో ఉంది.దీంతో నాగబాబుకు సరైన అభ్యర్థిని వైసిపి డిసైడ్ చేసినట్లు సమాచారం.ఓటమెరిగిన నేతగా పేరుపొందిన జగన్ కు వీర విధేయుడు అయిన మాడుగుల ఎమ్మెల్యే , ఏపీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు( Budi Mutyala Naidu ) ను అనకాపల్లి నుంచి ఎంపీ గా పోటీ చేయించే ఆలోచనతో వైసిపి ఉన్నట్లు సమాచారం.  టిడిపికి కంచుకోట వంటి మాడుగల లో వైసీపీ జెండా ఎగరవేసిన సమర్ధుడైన నేతగా ముత్యాల నాయుడు కి పేరు ఉంది.

ఆయన అక్కడ మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఖాయం అనే  అభిప్రాయాలు ఉండగా, ఇప్పుడు ఆయనను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం చూస్తోంది.

Telugu Anakapallymp, Budi Mutyala, Janasena, Janasenani, Madugula Mla, Brother,

 సీనియర్ నేతగా నాగబాబును డీ కొట్టగలరని వైసీపీ అంచనా వేస్తోంది.అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో కాపు ,వెలమ, గవర సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది .గవరల ప్రాబల్యం అనకాపల్లి య,  పెందుర్తిలో ఎక్కువగా ఉంటుంది.కాపుల ప్రభావం ఎక్కువగా పెందుర్తి, అనకాపల్లి , యలమంచిలి , చోడవరం,  పాయకరావుపేటలలో ఉంటుంది .ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో నాగబాబు మీద బూడి ముత్యాలు నాడిని పోటీకి దింపితే బీసీలంతా ఏకమై వైసీపీ విజయానికి కృషి చేస్తారని ఆ పార్టీ అంచనా వేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube