ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావడానికి కారణాలివే.. పరుచూరి సంచలన కామెంట్స్ వైరల్!

ఈ ఏడాది డిజాస్టర్ గా నిలిచి భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఫ్యామిలీస్టార్ ఒకటి కావడం గమనార్హం.పరుచూరి గోపాలకృష్ణ( Paruchuri Gopala Krishna ) ఫ్యామిలీస్టార్ మూవీ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

 Paruchuri Gopalakrishna Comments About Family Star Movie Details Here Goes Vira-TeluguStop.com

ఫ్యామిలీస్టార్ మూవీ ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఆయన వెల్లడించడం జరిగింది.ఫ్యామిలీ స్టార్ మూవీ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ అని అన్నారని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Jagapathi Babu, Mrunal Thakur, Paruchurigopala, Tollywood-Movie

సినిమాలో చాలా కథలు ఉన్నాయని కథ, కథా చాతుర్యంతో దర్శకుడు ఆడుకున్నాడని పరుచూరి పేర్కొన్నారు.ఈ సినిమాలో హీరో బాడీ లాంగ్వేజ్ కు ఉన్న యూత్, లవ్ ఫీల్ ను మించి ఒక యాక్షన్ హీరో బాడీ లాంగ్వేజ్ ను ఆపాదించారని ఆయన అన్నారు.హీరో ఇమేజ్ కు భిన్నంగా ఫైట్స్ చేయించడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని నేను భావిస్తానని పరుచూరి చెప్పుకొచ్చారు.

Telugu Jagapathi Babu, Mrunal Thakur, Paruchurigopala, Tollywood-Movie

హీరో తన ఈగోతో హీరోయిన్ ను దూరం చేసుకోవడం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని ఆయన తెలిపారు.ఈ సినిమా సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే గ్రిప్ తగ్గిందని ఆయన వెల్లడించారు.జగపతిబాబు ( Jagapathi Babu )రోల్ హీరోయిన్ గురించి చెప్పకపోతే హీరో హీరోయిన్ విడిపోతారేమో అనేలా డైరెక్టర్ స్క్రిప్ట్ ను నడిపాడని పరుచూరి పేర్కొన్నారు.

విజయ్ లవర్ బాయ్ అని అతనిని దృష్టిలో పెట్టుకుని కథలు రాసే సమయంలో ఆడిటోరియానికి సరిపడేలా ట్రీట్ చేస్తే సినిమాలు సక్సెస్ సాధిస్తాయని పరుచూరి తెలిపారు.ఈ సినిమా విషయంలో పరుచూరి చేసిన కామెంట్స్ నిజమేనని నెటిజన్లు సైతం చెబుతున్నారు.

విజయ్ దేవరకొండ ఎంచుకునే కథల విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.తర్వాత ప్రాజెక్ట్ లతో విజయ్ దేవరకొండ ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube