అమ్మ పాడే జోల పాట గాయని ఎవరో తెలుసా..?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒకటే పాట ఎక్కువగా వినబడుతుంది.ఇక సోషల్ మీడియాలో ఈ పాటకు రీల్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

 Do You Know Who Is The Singer Of Amma's Jola Song, The Singer, Sang, Amma Pade J-TeluguStop.com

అమ్మకు సంబంధించిన ఈ పాట ప్రస్తుతం ఎందరినో ఆకట్టుకుంటుంది.అమ్మపై ఉన్న చెప్పలేని ప్రేమను ఎంతో అందంగా పాట రూపంలో వినిపించిన ఆ వాయిస్ ఎందరో హృదయాలను ఇట్టే ఆకర్షిస్తుంది.

మనసుని హత్తుకునే లిరిక్స్ అందుకు తగ్గ వినసంపైన వాయిస్ జత కావడంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రేడింగ్ గా మారింది.ఈ సాంగ్ ఒక్కసారి విన్నవారు పదేపదే ఆ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ పాటను మిట్టపల్లి సురేందర్ ( Mittapalli Surender )రాశారు.అయితే ఆయన పాట అద్భుతంగా రాసిన.

దానిని ఎంతో అందంగా ఆలపించిన ఆ అమ్మాయి వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఇకపోతే ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటన్న విషయాలు ఓసారి చూస్తే.

Telugu Amma Pade Jola, Ammas Jola, Janhavi Yerram, Latest, Sang-Latest News - Te

అమ్మ పాట పాడిన ఆ అమ్మాయి పేరు జాహ్నవి ఎర్రం( Jahnavi erram ).ఈ అమ్మాయి మహారాష్ట్రకు( Maharashtra ) చెందిన తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి.ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాహ్నవి తాను తెలుగు అమ్మాయిని కానీ.తనకి తెలుగు మాట్లాడడం సరిగా రాదని చెప్పుకొచ్చింది.జాహ్నవి మిట్టపల్లి స్టూడియో ఛానల్ కోసం ఈ పాటను ఆలపించింది.ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాయగా సిస్కో డిస్కో ( Cisco Disco )అనే బృందం సంగీతం అందించారు.

వినడానికి ఎంతో ఇంపుసొంపుగా ఉన్న ఈ పాట ఎంతోమంది హృదయాలను దోచేసింది.

Telugu Amma Pade Jola, Ammas Jola, Janhavi Yerram, Latest, Sang-Latest News - Te

ఇందులో ముఖ్యంగా మాట్లాడటానికి తెలుగు రాకపోయినా అమ్మ పాటను ఎంతో వినుసంపుగా, అందంగా పాడిన సింగర్ జాహ్నవి నీ పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రజలు.ఈ మధ్యకాలంలో జాహ్నవి మెట్టుపల్లి సురేంద్ర కలిసి అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్న సంగతి కూడా తెలిసిందే.ఈ పాట పాడిన తర్వాత జాహ్నవికి ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 1.26 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేశారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పాటను మరో మారి వినండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube