అలాంటి పాత్రలో నటించాలన్నదే నా డ్రీమ్.. కృతి శెట్టి కామెంట్స్ వైరల్!

ఉప్పెన సినిమా( Uppena Movie ) ద్వారా హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి కృతి శెట్టి.మొదటి సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి అయితే ఇటీవల కాలంలో ఈమె నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

 Kriti Shetty Interesting Comments About Her Dream Roles ,kriti Shetty ,dream Rol-TeluguStop.com

ఇలా సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమె ఆచితూచి అడుగులు వేస్తూ సినిమా అవకాశాలను అందుకుంటున్నారు అయితే త్వరలోనే శర్వానంద్ ( Sharwanand ) హీరోగా నటించిన మనమే ( Maname ) సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతి శెట్టి ఛాన్స్ అందుకున్నారు.

Telugu Dream, Kriti Shetty, Maname, Sharwanand, Tollywood-Movie

ఇప్పటికే సినిమా షూటింగ్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా జూన్ ఏడవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.ఇలా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.ఈ క్రమంలోనే చిత్ర బృందం ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు కృతి శెట్టి ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

Telugu Dream, Kriti Shetty, Maname, Sharwanand, Tollywood-Movie

మనమే సినిమాలో నా పాత్ర పేరు సుభద్ర అని తెలిపారు.అయితే నేను ఇప్పటివరకు చాలా సున్నితమైన అమ్మాయి పాత్రలలో నటించాను కానీ ఈ సినిమాలో మాత్రం నాలో మరో కొత్త కోణం చూస్తారని తెలిపారు.ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అయ్యే యూనివర్సల్‌ కాన్సెప్ట్‌ ఇది.తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే అనుబంధం హృద్యంగా అనిపిస్తుంది.ఇక తన డ్రీమ్ రోల్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ.బాహుబలి సినిమాలో అనుష్క నటించినటువంటి మహారాణి పాత్రలో నటించాలని ఉందని, అలాగే యాక్షన్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యం ఉన్న రోల్స్‌ చేయాలని ఉందని ఈమె తన మనసులో కోరికను బయట పెడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube