గతంలో హీరోయిన్లు అంటే చాలా అందంగా ఉండాలి.రూపానికి తగిన శరీర సౌష్టవం ఉండాలి.
ఆ తర్వాత నటన రావాలి అని ఏవేవో మార్కులు పెట్టేవారు.అందుకే అప్పట్లో సినిమా రంగానికి అంతగా విలువు ఉండేది కాదనే భావన జనాల్లో ఉండేది.
అటు హీరోయిన్లు అంటే ముంబై నుంచి దిగుమతి కావాలి అనే దిక్కుమాలిన పద్దతి పాటించారు చాలా మంది దర్శకులు.తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి వచ్చినా అంతగా రాణించేవారు కాదు.
కానీ ప్రస్తుతం ఆ మూస పద్దతులు కాస్త మూలకు పడ్డాయి.హీరోయిన్లు అంటే నేచురల్ గా ఉండాలనే భావన కలుగుతోంది.
జనాలతో పాటు ఫిల్మ్ మేకర్స్ లోనూ.అందుకే చాలా మంది హీరోయిన్లు మన ఇంట్లోని అమ్మాయిల్లాగే కనిపించేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
అలా వచ్చిన అమ్మాయే సాయి పల్లవి.ముఖం మీద మొటిమలు, అంత అందంగా ఉండదు.శరీరం సౌష్టవం కూడా అద్భుతం ఏమీ కాదు.వాయిస్ కూడా అంతంత మాత్రమే.
అంగాంగ ప్రదర్శన అస్సలు చేయదు.తెలుగు కూడా అంతబాగా రాదు.
గతంలో అయితే సాయి పల్లవి లాంటి వారిని హీరోయిన్లుగా తీసుకోవాలంటే దర్శకులు కచ్చితంగా నో చెప్పేవారు.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.శేఖర్ కమ్ముల ఈ అమ్మాయిని తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేసి కొత్త టాలెంట్ కు అవకాశం కలిగించాడు.సాయి పల్లవి తన చక్కటి నటనతో అందరికీ ఆకట్టుకుంది.
ఫిదా సినిమాతో జనలను ఫిదా చేసింది.
ప్రస్తుతం దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది సాయి పల్లవి.నటనా ప్రాధాన్యత లేని క్యారెక్ట్ అస్సలు చేయనని చెప్తుంది.కోటి రూపాయలు ఇచ్చినా ఎక్స్ పోజింగ్ చేసే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొడుతుంది ఈ ముద్దుగుమ్మ.
20 ఏండ్ల తర్వాత తన పిల్లలు సినిమా చూసినా మా అమ్మ బాగా నటించింది అనుకోవాలే తప్ప తలదించుకునేలా చేయను అంటుంది ఈ అమ్మాయి.మొత్తంగా హీరోయిన్ల విషయంలో సాయిపల్లవి కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది అని చెప్పుకోవచ్చు.